సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ ఓపెనింగ్ జోడి ఆడుతుంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ ఓపెనింగ్ జోడి ఎన్నో గొప్పగొప్ప రికార్డులను నెలకొల్పింది. టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ జట్టు నడిపిస్తే.. సచిన్ బ్యాటింగ్‌లో టీమిండియాకు పెద్దన్నగా నిలిచాడు. వీరిద్దరికి అప్పట్లో ద్రవిడ్ కూడా తోడునిలిచాడు. వీరి ముగ్గురిని త్రిమూర్లులు అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఒక్కరి తర్వాత ఒకరు వీడ్కోలు పలికారు. 2012లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దాదా.. ఇన్నాళ్లకు కొన్ని ఆసక్తికరమై విషయాలను బయటపెట్టాడు. అది కూడా సచిన్, సెహ్వాగ్, ముత్తయ్య మురళీ ధరణ్ లాంటి దిగ్గజాల గురించి పలు విషయాలను తెలిపాడు.
టీమిండియాలో మరో విజయవంతమైన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే కూడా సచిన్ టెండూల్కర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించడాన్ని ఇష్టపడే వాడినని దాదా తెలిపాడు. గంగూలీ మాట్లాడుతూ..‘సెహ్వాగ్ కంటే సచిన్‌తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. నిజానికి నన్ను బెటర్ ప్లేయర్ చేసింది సచినే. నాలోని ఆటను సచిన్ మేలుకొలిపే వాడు. అయినా సచిన్ చాలా తెలివిగా అన్ని విషయాలు గ్రహిస్తాడు, అవతలి వాడి ఆటను అర్థం చేసుకుంటాడు. కానీ సెహ్వాగ్‌కు అంత తెలివిలేదు. అతను ఇన్‌సెన్స్. అందుకే సెహ్వాగ్, సచిన్‌లో నా ఓటు సచిన్‌కే. అలాగే.. పలు సార్లు సచిన్ రిబ్స్‌లో బంతి తగిలేది. కానీ అతను కొంచెం కూడా నొప్పిని తెలియనిచ్చే వాడు కాదు. రిబ్స్‌లో బంతి తగిలినా.. పరుగులు చేసేవాడు. తర్వాతి రోజు చూస్తూ.. పక్కటెముకల్లో రెండు ఫ్యాక్చర్లు అయ్యేవి. సచిన్ అలాంటి డెడికేషన్‌తో ఆడేవాడు.’ అని దాదా సచిన్ గొప్పతనం గురించి వెల్లడించాడు.
అలాగే మరిన్ని విషయాలపై మాట్లాడుతూ..‘ముత్తయ్య మురళీ ధరణ్ వయసు పెరిగే కొద్ది మరింత డేంజర్‌గా మారుతూ వచ్చాడు. అతని బౌలింగ్‌లో ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. క్రికెట్‌లో మనం హైలో ఉన్నసమయంలో రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటాను. ఆటలో ఒత్తిడిని తట్టుకొవడం అనేది.. మన బ్రెయిన్‌ను ట్రైన్ చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉంటే.. ఆటలో ఒత్తిడిని అంత ఈజీగా అధిగమించగలం.’ అని గంగూలీ తెలిపాడు. ఇక బీసీసీఐ ప్రెసిండెంట్, టీమిండియా కెప్టెన్.. ఈ రెండు కీలక బాధ్యతలతో ఏది ఎక్కువ ఆనందాన్ని కలిగించిని, ఏ రోల్‌లో ఉండేందుకు ఇష్టపడతారనే ప్రశ్నకు క్రికెట్ టీమ్‌తో ఉండటమే తనకు ఇష్టమని దాదా తన మనసులోని మాటను బయటపెట్టాడు.
అలాగే లార్డ్స్‌లో నాట్‌వెస్ట్ ఫైనల్ విజయం కంటే.. కోల్‌కత్తాలో 2001లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయమే తనకు ఎక్కువని.. ఎందుకు ఆ విజయం జట్టులో ఒక కొత్త మార్పు తీసుకొచ్చిందని దాదా అన్నాడు. కాగా.. భారత అత్యుత్తమ కెప్టెన్లలో గంగూలీ ముందు వరసలో ఉంటాడు. టీమిండియా దశ, దిశ మార్చిన కెప్టెన్, యువ క్రికెటర్లను ప్రొత్సహించి.. యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని లాంటి టాలెంటెడ్ క్రికెటర్లను టీమిండియాకు అందించిన కెప్టెన్‌గా గంగూలీ చరిత్రలో నిలిచిపోయాడు. భారత జట్టుకు మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లో కూడా గెలవడం, భయం లేకుండా ఆడటం నేర్పిన లీడర్‌గా ఇండియన్ క్రికెట్‌లో దాదా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఇండియన్ క్రికెట్‌కు సేవలు అందించాడు.
‘Sachin was sane, Sehwag was insane’: Sourav Ganguly picks his favourite opening partnerhttps://t.co/SCTeWMntpu #CricketTwitter pic.twitter.com/pdFo6rzIZx
— Sports Tak (@sports_tak) November 12, 2022