ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ రానే వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో రేపు(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఆ టీమ్‌తో మ్యాచ్‌కు ముందే పాక్ గాలి తీసినట్లు మాట్లాడాడు రోహిత్. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఎప్పటిలానే ప్రెషర్ అనే పదం వినిపిస్తూనే ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఆ మాట తాను వాడదల్చుకోలేదని రోహిత్ అన్నాడు. 2007 నుంచి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడుతున్నానని.. అప్పటి పాక్ టీమ్స్ లాంటిదే ఈ పాక్ టీమ్ కూడా అని పేర్కొన్నాడు.
రోహిత్ మాట్లాడుతూ..‘పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే మా ఫోకస్ అంతా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ మంచి ఛాలెంజింగ్ టీమ్‌లా ఉంది. ఇక భారత్-పాక్ మ్యాచ్ అనగానే ఒత్తిడి అనేది ఉంటుంది. అది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఉంటుంది. కానీ.. ఈసారి నేను ఆ పదం వాడాలనుకోవడం లేదు. ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు పాకిస్థాన్‌ను ఎదుర్కొన్నాను. అప్పటి పాక్ టీమ్స్ కూడా మంచి టీమ్స్‌గా ఉండేవి.. అలాంటిదే ఇప్పటి పాక్ టీమ్. కాకుంటే.. మ్యాచ్ రోజు ఎవరూ మంచి ప్రదర్శన ఇస్తే.. వారిదే విజయం. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ టీమ్ మంచి ప్రదర్శన చేసింది.’ అని రోహిత్ శర్శ అన్నాడు.
వచ్చే ఏడాది పాక్‌కు వెళ్లడంపై..
కాగా.. 2023లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్ వెళ్లడంపై స్పందిస్తూ.. వాటి గురించి ఇరుదేశాల బోర్డు సభ్యులు చూసుకుంటారు. ప్రస్తుతం అయితే తమ ఫోకస్ మొత్తం పాక్‌తో మ్యాచ్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ పైనే ఉందని అన్నాడు. కాగా.. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ కోసం టీమిండియా పాక్ వెళ్లదని.. అవసరమైతే ఆసియా కప్ వేదికను మారుస్తామని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) ప్రెసిడెంట్‌గా ఉన్న జైషా ప్రకటించడంపై పాక్ క్రికెట్ బోర్డు మండిపడింది. ఆసియా కప్ 2023 వేదిక మార్చినా, టీమిండియా పాక్‌కు రాకపోయినా.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేయడంతో పాటు ఏసీసీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
వర్షం వస్తే..
మెల్‌బోర్న్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగేంచే అవకాశం ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందిస్తూ.. వర్షం ఆడి మ్యాచ్ జరిగినా.. టాస్ ఎంతో కీలకంగా మారుతోంది. ఇప్పటికైతే మెల్‌బోర్న్‌లో వాతావరణం చక్కబడినట్లు తెలుస్తోంది. ఒక వేళ వర్షం వచ్చినా.. మ్యాచ్‌ను తక్కువ ఓవర్లకు కుదిస్తారు. దానికి కూడా మేము పూర్తి సిద్ధంగా ఉన్నామని రోహిత్ శర్మ వెల్లడించాడు. వర్షం అంతరాయం కలిగిస్తే.. 10 లేదా 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగొచ్చు. మా టీమ్ దానికి కూడా రెడీగా ఉంది. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో 8 ఓవర్ల మ్యాచ్ ఆడిన అనుభవం మాకుంది అని రోహిత్ పేర్కొన్నాడు. మరి రేపు మాత్రం మెల్‌బోర్న్ వర్షం రావద్దని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.
First press conference for Rohit Sharma as a captain in World Cup tournament. pic.twitter.com/EeLVRLVfJR
— Johns. (@CricCrazyJohns) October 22, 2022