పాక్ తో పోరు ముగిసింది.. ఇప్పుడు దృష్టంతా నెదర్లాండ్స్ పైనే. గురువారం సిడ్నీ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. పసికూన జట్టైనా నెదర్లాండ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో తలమునకలై ఉంటే.. మనవాళ్లు మాత్రం ‘ప్రాక్టీస్ గ్రౌండ్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.. మేము వెళ్లలేం అంటూ చేతులెత్తేశారు. అసలే విరాట్ కోహ్లీ మినహా ఏ ఆటగాడు సరిగా రాణించట్లేదు. ఇలాంటి సమయంలో స్కిప్ చేయడం సరైన నిర్ణయమా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే.. టీమిండియా సారధి రోహిత్ శర్మపై అతని కోచ్ సిద్దేశ్ ల్యాడ్ విరుచుకుపడ్డాడు. ‘టీ20 మ్యాచ్ అంటే.. 20 ఓవర్లు ఉంటాయి.. ఒక ఓవర్ లోనే 20 ఓవర్ల స్కోర్ రాబట్టాలనుకోవడం మూర్ఖత్వం..’ అంటూ ఇండైరెక్ట్ గా ఏకిపారేశాడు.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ టోర్నీ, అందులోనూ దాయాది పాకిస్తాన్ తో పోరు. ఒక సారధిగా రోహిత్ శర్మ ఎలాంటి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాలి. అలాంటి మ్యాచులో హిట్ మ్యాన్ చేసిన స్కోర్..4. పోనీ, అంతకుముందు జరిగిన వామప్ మ్యాచుల్లో అయినా రాణించాడా! అంటే అదీ లేదు. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వామప్ మ్యాచులో 3 (4 బంతుల్లో) పరుగులు చేసిన హిట్ మాన్, ఆపై రెండో మ్యాచులో బరిలోకి దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులోనూ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ ప్రదర్శనపై అతని కోచ్ సిద్దేశ్ ల్యాడ్ సంతృప్తిగా లేడు. ‘మ్యాచ్ విజయానికి సహకరించాలి కానీ, ఆ మ్యాచును నాశనం చేసే ఆట ఆడకూడదంటూ..’ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
తాజగా, పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దేశ్ ల్యాడ్ మాట్లాడుతూ..” టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ భారత్‌కు నాయకత్వం వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. 2007లో తన అరంగేట్రం ప్రపంచకప్‌లో భారత్ ప్రపంచకప్ గెలిచినట్లే, కెప్టెన్‌గా ఇప్పుడు అతడు ప్రపంచకప్‌ను గెలవాలని కోరుకుంటున్నా. అయితే రోహిత్ చాలా కాలంగా హై-రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు. మితిమీరిన దూకుడు ప్రదర్శించడంలోనే అతడు తప్పు చేస్తున్నాడు. టీ20 మ్యాచ్ అంటే.. 20 ఓవర్లు ఉంటాయి. 17/18 ఓవర్లు ఆడటానికి ప్రయత్నించాలి. అంతేకానీ, ఒక ఓవర్ లోనే 20 ఓవర్ల స్కోర్ రాబట్టాలనుకోవడం కరెక్ట్ కాదు.”
“ఆస్ట్రేలియా వెళ్లేముందు అతనితో చివరిసారి మాట్లాడాను. అప్పుడు టెక్నిక్ గురించి మాట్లాడలేదు లేదు కానీ, క్రీజులో ఉండి తెలివిగా ఆడాలని సలహా ఇచ్చా. కొన్నిసార్లు అనవసర షాట్ల వల్ల వికెట్ పారేసుకుంటున్నాడు. దీని వల్ల విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఒక మ్యాచులో యాంకర్ పార్ట్ రోల్ చేయాలి.. కానీ, ఆ మ్యాచ్ మనవల్లే పోయిందనే అభిప్రాయం కలిగించకూడదు. విరాట్ కోహ్లీని చూడండి. ఎంత నియంత్రణలో ఉంటాడో. అతను ఎప్పుడూ తప్పుడు షాట్ ఆడలేదు. అదే అతని సక్సెస్ కు నిదర్శనం. రాబోయే మ్యాచ్‌ల్లో రోహిత్ పుంజుకుంటాడన్న నమ్మకం ఉంది..” అని సిద్దేశ్ ల్యాడ్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు తదుపరి మ్యాచులో గురువారం నెదర్లాండ్స్ తో తలపడనుంది.
Sunil Gavaskar expresses his concern over Rohit Sharma’s form.#T20WorldCup | #T20WorldCup2022 | #India pic.twitter.com/uZh361lt1a
— CricTracker (@Cricketracker) October 26, 2022
Coach of Rohit Sharma (in PTI) said “I feel Rohit Sharma should spend sometime in the middle, take his time in powerplay and play natural game but now he is playing a high risk game, I think he is making a mistake by playing over-aggressive but he will come back strong”.
— Johns. (@CricCrazyJohns) October 26, 2022