టీ20 ప్రపంచ కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. అనూహ్య సంఘటనలు, ట్విస్టులు, పరిణామాల మధ్య నాలుగు జట్లు సెమీస్లోకి ఎంటరయ్యాయి. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకోగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాక్ జట్లు సెమీస్ అర్హత సాధించాయి. అయితే ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు మిగతా జట్ల మ్యాచులతో సంబంధం లేకుండా సెమీస్కు దూసుకెళ్తే.. పాక్ మాత్రం నెదర్లాండ్స్ రూపంలో అదృష్టం వరించడంతో సెమీస్ బెర్తుకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో టీమిండియా నవంబరు 10న ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సన్నద్ధతపై భారత సారధి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
లీగ్ దశలో మొత్తంగా 5మ్యాచులు ఆడిన భారత్, సౌతాఫ్రికాతో ఓటమి మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్, మూడింటిలో విజయం సాధించగా.. ఒక మ్యాచులో ఐర్లాండ్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక్కడ ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో ఓడటం మినహా మిగతా అన్ని మ్యాచుల్లో అద్భుతంగా రాణించినందని చెప్పాలి. దుర్భేద్యమైన బ్యాటింగ్, బలమైన బౌలింగ్ లైనప్ ఇంగ్లాండ్ సొంతం. దీనికి తోడు.. గంటకు 150 కి. మీ. వేగంతో బంతులేస్తున్న మార్క్ వుడ్ ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు ఒక సవాలే. ఈ నేపథ్యంలో అన్నింట్లోనూ బలంగా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించాలంటే భారత ఆటగాళ్లు శక్తికి మించి పోరాడాల్సిందే. అందులోనూ భారత్.. ప్రపంచకప్‌లో నాకౌట్‌లో 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్‌తో తలపడనుంది.
India will be facing England for the first time in 35 years in a World Cup’s knockout match.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2022
“ఇంగ్లాండ్ తో మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే ముందుకెళ్తాము. అయితే అంతకుముందు పిచ్ పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు కావడం మరీ ముఖ్యం. అందులోనూ అడిలైడ్ వేదికగా ఒక మ్యాచ్ ఆడటం మాకు సానుకూలాంశం. లీగ్ దశలో ఇంగ్లాండ్ చాలా అద్భుతంగా ఆడింది. అలా అని ఇక్కడ మేం ఏం సాధించామనేది మరిచిపోం. జట్టుకు అవసరమైన విధంగా వ్యక్తిగత ప్రదర్శన ఇచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. మంచి ప్రదర్శన చేస్తే ఆటోమేటిక్ గా విజయం వరించే అవకాశం ఉంది. అయితే అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి అమలు చేయాల్సి ఉంటుంది” అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా నవంబర్ 10న జరగనుంది.
Touchdown Adelaide 📍#TeamIndia | #T20WorldCup pic.twitter.com/absGUDySIK
— BCCI (@BCCI) November 7, 2022
India Vs England Semi Finals promo. pic.twitter.com/moeKkp9Pfi
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022