ఇంగ్లండ్‌తో సెమీస్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ మార్పుల్లేని జట్టుతోనే బరిలోకి దిగాడు. సూపర్ 12లో జింబాబ్వేతో ఆడిన జట్టుతోనే సెమీస్‌కు సిద్ధమయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగుతుందని అంతా భావించారు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తుది జట్టులో స్థానం దక్కని పంత్‌కు.. జింబాబ్వేతో మ్యాచ్‌లో రోహిత్ పంత్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ.. పంత్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో సెమీస్‌కు మళ్లీ డీకే జట్టులోకి వస్తాడని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ మాత్రం పంత్‌పై ఇంకా నమ్మకం ఉంచాడు. ఇంగ్లండ్‌తో ఎంతో కీలకమైన సెమీస్‌కు డీకేను కాదని పంత్‌నే కొనసాగించాడు.
కాగా.. దినేష్ కార్తీక్‌ను కాదని పంత్‌ను కొనసాగించాడనికి గల కారణాన్ని వివరించాడు. టాస్ తర్వాత మాట్లాడిన రోహిత్.. ‘టాస్ గెలిచి ఉంటే మేం కూడా బ్యాటింగే చేయాలని అనుకున్నాం. ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఇంగ్లండ్ ఆటగాళ్ల గురించి మాకు తెలుసు.. ఇటీవల వారితో చాలా మ్యాచ్‌లు ఆడాం. వారి బలాలు, బలహీనతలు తెలుసు. కూల్‌గా ఉంటూ మా ప్లాన్స్ పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యం. నా గాయం భయపెట్టింది. కానీ.. ఇప్పుడు బాగానే ఉన్నాను. జట్టు టాలెంటెడ్ ఆటగాళ్లతో నిండిపోవడంతో ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక కష్టంగా ఉంది. కానీ.. ఇప్పుడు మాత్రం మార్పులు చేయడం లేదు. షార్ట్ బౌండరీలు ఉన్న నేపథ్యంలోనే బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన రిషభ్ పంత్‌ను కొనసాగించాం.’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
The match is with bowlers hands..
you guys got a job to do..put a defendable maximum total at least @klrahul @ImRo45 @imVkohli @surya_14kumar @RishabhPant17 🙏🏻 pic.twitter.com/TW6cootqil— VerithanaM 😈 (@VickyVjAddict) November 10, 2022