టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు వీరబాదుడుకు.. భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఒకానొక సమయంలో మేం వేయలేం అన్నట్లుగా బౌండరీల దగ్గరకి వెళ్లి నిల్చుండిపోయారు. ఈ సమయంలో అందరకి గుర్తొచ్చిన ఒకే ఒక్కడు.. మహేంద్ర సింగ్ ధోని. లక్ష్యాన్ని నిర్ధేశించడం కాదు.. దాన్ని ఎలా కాపాడుకోవాలన్నది ధోనీని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే.. టీమిండియా ఓటమి అంచుల్లో నిలవగానే ఫ్యాన్స్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసుకున్నారు. ధోనీ.. ధోనీ.. అంటూ నినాదాలు చేశారు.
We missed you today 💔💔#INDvsENG#captaincy#MSDhoni pic.twitter.com/IoLs3SoCKq
— Nadeem khan (@Nadeemlam) November 10, 2022
తొలిసారి ఐసీసీ ట్రోఫీని 1983లో మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సాధించి పెట్టాడు. ఆ తరువాత మహేంద్రుడు.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు. ఇక అప్పటినుండి టీమిండియాకి దరిద్రం పట్టుకుంది. ఆ తరువాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ స్టేజీలకు వెళ్తున్నా.. టైటిల్‌ని మాత్రం అందుకోలేకపోతోంది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో ఓడిన టీమిండియా, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరులో ఓటమిపాలైంది. అలాగే.. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. ఇలా నాకౌట్ మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటములన్నిటికి ప్రధాన కారణం.. వ్యూహాలు అమలుపరచడంలో విఫలమవ్వడమే.
ఈసారైనా ఆ కోరిక నెరవేరబోతుందనుకున్నారంతా.. కారణం రోహిత్ శర్మ. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు విజేతగా నిలిపిన రోహిత్ వ్యూహాలు అమలుచేయడంలో దిట్ట అనుకున్నారు అందరూ. అయితే హిట్ మ్యాన్ మాత్రం.. నేను దిట్ట కాదు.. లొట్ట అని నిరూపించాడు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీస్ వరకైనా చేరిందంటే దానికి కారణం.. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు రాణించడం మూలానే. ఇదిలా ఉంచితే.. ఈ టోర్నీ అమాంతం రోహిత్ కెప్టెన్సీ మార్క్ ఏ మ్యాచులోనూ కనపడలేదు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో రెండో ఇన్నింగ్స్ పవర్ ప్లే ముగిసేసరికే ఫలితం తేలిపోయింది. 169 పరుగుల భారీ లక్ష్యమున్నా.. బౌలర్లను సక్రమంగా ఉపయోగించుకోలేకపోయాడు రోహిత్. దీంతో మహేంద్రుని నామస్మరణ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ గడ్డ మీద వారిపైనే 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం ధోనీకే చెల్లిందంటున్నారు. మరి ధోనీ తర్వాత బెస్ట్ కెప్టెన్‌గా చెప్పుకునే రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోవడం మినహా బుర్రకు పదును పెట్టిన సందర్భాలు ఎక్కడా అని నిలదీస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్ లాంటి రిస్ట్ స్పిన్నర్‌ను పక్కనబెట్టి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవడమా? రోహిత్ కెప్టెన్సీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ధోనీలా ఐసీసీ ట్రోఫీలు గెలవడం అంత తేలిక కాదని కొందరు ట్వీట్లు చేయగా.. భారత్ కు ఐసీసీ ట్రోఫీలు గెలిచే కాలం ధోనీతోనే ముగిసిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Defended 130 runs vs England in ICC Finals that too on their home ground . Best Captiancy from Greatest Captain MS Dhoni 👑 pic.twitter.com/2dxsDSBEvN
— 𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬𝐌𝐒𝐃𝐢𝐚𝐧™ (@itzShreyas07) November 10, 2022
It’s not easy to win ICC trophy as MS Dhoni made it looked like pic.twitter.com/G2bIlYJZrt
— Div🦁 (@div_yumm) November 10, 2022