క్రికెట్ మాత్రమే కాదు ఏ గేమ్ లో అయినా సరే ప్రతి మ్యాచ్ కీలకమే. కప్ కొట్టాలన్నా, విజేతగా నిలవాలన్నా సరే ఎప్పుడూ అలెర్ట్ గా ఉండాలి. లేదంటే అప్పటివరకు పడిన కష్టం అంతా వృథా అవుతుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. మొన్నమొన్నటి వరకు టీ20ల్లో పడుతూ.. లేస్తూ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ మొదలవడానికి ముందు జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అలాంటి జట్టు సూపర్-12 దశలో ఐదింట్లో నాలుగు మ్యాచులు గెలిచి.. సెమీస్ లో అడుగుపెట్టింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సరిగ్గా మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే టీమిండియా ఓడిపోతుందని రోహిత్ కు ముందే తెలుసా? అంటూ ఫ్యాన్స్ రోహిత్ పై ఫైర్ అవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. అటు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుని ఐదుసార్లు గెలిపించాడు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా.. గ్రూప్ దశలో విజయవంతంగా ఆడిన భారత జట్టు.. కప్ కొట్టేందుకు సరిగ్గా రెండడుగుల దూరంలో ఉంది. ఇంగ్లాండ్ పై గెలిస్తే, ఫైనల్లో పాక్ తో తలపడతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఫోకస్ గా ఉండాలి. కానీ రోహిత్ మాత్రం అసలు సంబంధమే లేనట్లు మాట్లాడుతున్నాడు. నాకౌట్ లోని ఆటతీరు.. మన గేమ్ ని డిసైడ్ చేయదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
‘నాకౌట్ మ్యాచులు కీలకమే. మాకు ఆ విషయం తెలుసు. నాకౌట్ అంటే ఒకసారి మాత్రం ఆడగలం. ఒక్క నాకౌట్ గేమ్ లో ఆడనంత మాత్రాన వాళ్లని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఏడాది మొత్తం కష్టపడి, నీకు నచ్చిన ఫార్మాట్ లో బాగా ఆడండి. నాకౌట్ మ్యాచ్ అనేది మీ గేమ్ ని డిసైడ్ చేయదు’ అని రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా అనిపిస్తోందని ఫ్యాన్స్.. రోహిత్ పై మండిపడుతున్నారు. వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ కు ముందు ఆటగాళ్లలలో ఆత్మవిశ్వాసం నింపాలి గానీ భయపడుతున్నట్లు మాట్లాడ్డం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సంవత్సరమంతా ఎలా ఆడినా ఎవరూ పట్టించుకోరు. కానీ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ నాకౌట్ మ్యాచుల్లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే సదరు కెప్టెన్ తోపాటు క్రికెటర్లని ఒక్కొక్కరిని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆడుకుంటారు. మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు టీమిండియా ఓడిపోబోతోందనే పరోక్షంగా చెప్పినట్లు కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.