టీమిండియా యంగ్‌గన్ రిషభ్ పంత్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ధోని తర్వాత టీమిండియాలో అతని స్థానం భర్తీ చేసేలా కనిపించిని పంత్‌కు ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ లాంటి టోర్నీలో తుది జట్టులో స్థానమే కరువైంది. వరల్డ్ కప్ ముందు వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ భీకర ఫామ్‌లో ఉండటం.. అదే టైమ్ పంత్ ఫామ్ కోల్పోవడంతో పంత్‌కు డీకే పోటీగా మారాడు. వరల్డ్ కప్ కోసం ఇద్దరూ ఎంపికైనా.. డీకేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు కారణం పంత్ సరైన ఫామ్‌లో లేకపోవడమే. అతన్ని ఫామ్‌లోకి తెచ్చేందుకు పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా ఆడించినా పంత్ విఫలం అయ్యాడు. దీంతో వరల్డ్ కప్ ప్రధాన మ్యాచ్‌ల్లో తొలి నాలుగు మ్యాచ్‌లకు పంత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. జింబాబ్వేతో అంత ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చినా.. పంత్ మళ్లీ 3 పరుగులు చేసి విఫలం అయ్యాడు.
టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా మారి వరల్డ్ కప్‌లో తురుపుమొక్కగా ఉంటాడనుకుంటే.. పంత్ మాత్రం తీవ్ర నిరాశ పరుస్తున్నాడు. ఈ పంత్‌లో కూడా స్పష్టం కనిపిస్తోంది. ఇలా జట్టులో చోటు దొరక్క ఇప్పటికే తెగ బాధపడుతున్న పంత్‌కు మరో విషయం పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పంత్‌కు విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గతంలో పరిచయం చెడి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా మినీ యుద్ధమే నడిచింది. పంత్ తనను కలిసేందుకు ఒక సారి హోటల్‌కు వచ్చి.. చాలా సేపు ఎదురుచూసి వెళ్లిపోయాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. దానికి బదులుగా కొంతమంది ఫేమస్ అవ్వడానికి తన పేరు వాడుకుంటున్నారంటూ పంత్ పరోక్షంగా స్పందించాడు.
ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే.. ఇక్కడితో పంత్ సైలెంట్ అయిపోయినా.. ఊర్వశి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పంత్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తుంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లకు హాజరవుతుండటంతో పంత్-ఊర్వశి టాపిక్ పాతబడటం లేదు. తాజాగా.. ఇదే విషయంపై మ్యాచ్ చూసేందుకు వస్తున్న అభిమానులు పంత్‌ను మరింత టార్చర్ చేస్తున్నారు. తుది జట్టులో చోటు దక్కని పంత్.. వాటర్ బాయ్‌గా ఉంటున్నాడు. దీంతో ఆటగాళ్లకు బౌండరీ లైన్ వద్దకు వెళ్లి వాటర్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో అభిమానులు.. పంత్‌ను పిలుస్తూ.. ‘ఊర్వశి పిలుస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో విసిగెత్తిపోయిన పంత్.. ఒక అభిమానికి కోపంగా బదులిచ్చాడు. ‘పంత్ భయ్యా.. ఊర్వశి పిలుస్తుంది’ అని అభిమాని అనగా.. ‘జాకే లేలే ఫిర్’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. వినడానికి సాధారణంగానే ఉన్నా.. హిందీలో ఇది ఒక ద్వంద అర్థాన్ని ఇస్తుంది.
Savage Rishabh Pant😂🔥#RishabhPant #indvseng #IndianCricketTeam pic.twitter.com/3fXzp5kTwu
— Tanay (@tanay_chawda1) November 7, 2022