ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. సూపర్ 12లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. జింబాబ్వేతో మిగిలిన ఉన్న మరో మ్యాచ్ గెలిస్తే.. అధికారికంగా భారత్ సెమీస్‌కు చేరుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా తర్వాత.. నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. సౌతాఫ్రికాపై ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కొనసాగుతున్నాడు.
ఈ వరల్డ్ కప్ కంటే ముందు రిషభ్ పంత్ జట్టులో ఎంతో కీలక ఆటగాడిగా ఉన్నాడు. వరల్డ్ కప్‌లోనూ పంత్ టీమిండియాకు తురుపుమొక్కగా ఉంటాడని అంతా భావించారు. కానీ.. వరల్డ్ కప్ కంటే ముందు ఫామ్ కోల్పోయిన పంత్.. ఆస్ట్రేలియాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లలో సైతం విఫలం అయ్యాడు. దీంతో పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. కాగా అదే టైమ్‌లో పంత్ స్థానంలో జట్టులో ఉన్న దినేష్ కార్తీక్ సైతం పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతో రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. పైగా పంత్‌కు ఆస్ట్రేలియాలో మంచి రికార్డులు ఉన్నాయి. టెస్టు సిరీస్‌లలో పంత్ ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే.
తాజాగా పంత్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర రికీ పాంటింగ్ స్పందించాడు. రిషభ్ పంత్‌కు టీమిండియాలో స్థానం లభించకపోవడం తానను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నాడు. పంత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని అన్నాడు. ఆస్ట్రేలియాలో అతను ఎలాంటి అద్భుతం చేశాడో గతంలో మనం చూశామని అయినా.. పంత్‌ను ఆడించడం లేదంటూ పేర్కొన్నాడు. రిషభ్ పంత్ విలువ భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియడం లేదనే ఉద్దేశంతో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అయితే.. జింబాబ్వేతో చివరి సూపర్ 12 మ్యాచ్‌లో పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌లో విఫలం అవుతుండటంతో అతని స్థానంలో పంత్‌ను తుది జట్టులో ఆడించేందుకు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Ricky Ponting (to @Vimalwa) said “I am really surprised that Rishabh Pant is not playing, he is a match winner, we have seen what he has done in Australia”.
— Johns. (@CricCrazyJohns) November 3, 2022