ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మజాని.. భారత్- పాక్ మ్యాచ్‌తో ప్రపంచం మొత్తం ఆశ్వాదించింది. ప్రతి బాల్‌కి నరాలు తెగే ఉత్కంఠ చూశాం. ప్రతి క్రికెట్ అభిమాని కుర్చీల్లోంచి లేచి ఆనందంతో కేకలు వేయడం చూశాం. మరి.. అలాంటి విజయాన్ని చూసి అభిమానులే ఇలా రియాక్ట్ అయితే ఆ గేమ్‌ని గెలిపించిన వాళ్లు, ఆడిన వాళ్లు, ఆడించిన వాళ్లు ఎంతలా రియాక్ట్ అవ్వాలి. అవును ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, స్టాఫ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ ఎలా రియాక్ట్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ద్రవిడ్ ఎంతో సంయమనంతో ఉంటూ వచ్చాడు. ఇటీవలి కాలంలో రాహుల్ ద్రవిడ్‌ని అస్సలు ఇలా చూసుండరు.
ఆఖరి ఓవర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. చివరికి మళ్లీ కోహ్లీనే ఆటని గాడిలో పెట్టాడు. ఆఖర్లో ఒక బంతికి ఒక పరుగు కావాలి. అశ్విన్ వచ్చి సింగిల్ తీసి మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత అంతా ఎంతో ఎమోషనల్ అయ్యారు. కోహ్లీ ఏడ్చాడు, హార్దిక్ పాండ్యా ఏడ్చాడు, రోహిత్ శర్మ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్రేశాడు. అందరూ ఇవే చూశారు. కానీ, డగౌట్‌లో ఉన్న ద్రవిడ్ ఉగ్రరూపం దాల్చాడు. మ్యాచ్ గెలిచామన్న గర్వం అతని ముఖంలో క్లియర్‌గా కనిపించింది. పెద్దగా అరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
నిజానికి ఒక్క ద్రవిడ్ మాత్రమే కాదు.. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు నిన్న అంతే ఎమోషనల్‌గా కనిపించారు. మైదానంలో ఉన్న అభిమానులు, టీవీల ముందు ఉన్న అశేష అభిమాన ఘనం నిన్న మ్యాచ్ చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ నిన్నటి మ్యాచ్ హీరోలని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇంక హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకుని.. బ్యాటింగ్‌లో 40 పరుగులు చేశాడు. అర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్లతో పాకిస్తాన్ టాపార్డర్‌ని చావుదెబ్బ కొట్టాడు. మొత్తానికి టీమిండియా చిరకాల ప్రత్యర్థిపై టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్‌లు కూడా ఇంతే కసితో ఆడి కప్ కొట్టాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
The best video on today’s magic match lead by Virat Kohli. pic.twitter.com/z0Zxt7smw6
— Johns. (@CricCrazyJohns) October 23, 2022