టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ పరువు మంటగలిసింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో చావుదెబ్బతిన్న పాకిస్థాన్ తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడి.. ఉందో లేదో తెలియని పరువును పొగొట్టుకుంది. టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇలాంటి దారుణమైన ఫెయిల్యూర్ నుంచి ఎలా గట్టేకాలో, తప్పిదాలను ఎలా సరిచేసుకోవాలో ఆత్మ విమర్శలు చేసుకోకుండా.. టీమిండియాపై అక్కసును వెళ్లగక్కుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియా వచ్చే వారం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ నటి ఒకామె.. టీమిండియా కూడా తమ తర్వాతి మ్యాచ్‌ల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోవాలంటూ శాపనార్థాలు పెట్టింది. వాళ్ల టీమ్ చెత్త ప్రదర్శన చేసి ఓడితే.. టీమిండియాపై పడి ఏడవడం ఏంటో అర్థం కావడం లేదంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ జాలి చూపిస్తున్నారు.
పాక్ అభిమానుల అసూయ, అక్కసును భారత క్రికెట్ అభిమానులు లైట్ తీసుకుంటున్నా.. అఫ్ఘానిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియాకు సపోర్ట్ చేస్తూ.. పాక్ శాపనార్థాలకు కౌంటరిస్తున్నారు. తాజాగా పాక్ నటి సెహర్ షిన్వారి ‘అల్లా దయతో ఇండియా కూడా జింబాబ్వే, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది’ అని ట్వీట్ చేసింది. తమ పాక్ టీమ్ ఓడిపోయినట్లే టీమిండియా కూడా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలని ఆమె కోరుకుంది. ఈ ట్వీట్‌కు వాజ్మా అయూబీ అనే అఫ్ఘానిస్థాన్ యువతి అదిరిపోయే కౌంటరిచ్చింది. ‘అల్లా దయతో టీమిండియా ఈ వరల్డ్ కప్ గెలవాలి. జింబాబ్వే చారిత్రత్మక విజయం సాధించింది’ అని ఆమె సెహర్ షిన్వారి ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా పాకిస్థాన్, నెథర్లాండ్స్‌పై విజయాలు సాధించి.. గ్రూప్ 2లో టేబుల్ టాపర్‌గా ఉంది. అలాగే.. పాకిస్థాన్ జట్టు భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడిపోయి.. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అలాగే వర్షాలు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో గ్రూప్ 2 నుంచి దాదాపు సెమీస్ చేరడం ఖాయంగా మారింది. ఇక పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలంటే.. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెథర్లాండ్స్‌పై కచ్చితంగా గెలిచి.. మిగతా జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
Allah karey k India World Cup hi jeet jayi inshallah 🤲 what a historic win for #Zimbabwe though 👌 https://t.co/8Bj7SivBGB
— Wazhma Ayoubi (@WazhmaAyoubi) October 28, 2022