ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్కో సారి ఓడిపోయిన జట్టు కూడా టోర్నీలో ముందుకు పోవడం మనం చూస్తునే ఉంటాం. ఇలాంటి మెగా టోర్నీలో జట్లు ఇంటిదారి పట్టడానికి కారణం.. ఇతర జట్ల విజయాలు, అపజయాలు అవుతాయి. అందుకే అప్పుడప్పుడు మన శత్రువు దేశం అయినా సరే గెలవాలి అని కోరుకున్న సందర్భాలు క్రీడాలోకంలో అనేక సార్లు చూశాం. దానికి ప్రధాన కారణం టీమ్ ల రన్ రేట్ లను పరిగణంలోకి తీసుకోవడమే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. టీమిండియాపై పాకిస్థాన్ ఓడిపోయినప్పటికీ పాక్ కు ఊరటే లభించింది. దానికి కారణం జింబాబ్వే-సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగారద్దు కావడం పాక్ కు వరంగా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాదేశ్, ఇండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు గ్రూప్ 2 లో ఉన్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, టీమిండియా చెరో మ్యాచ్ గెలిచి.. చెరో 2 పాయింట్లతో గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తాజాగా సౌతాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పుడిదే పాకిస్థాన్ పాలిట వరంగా మారింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా కచ్చితంగా గెలిచేదే. కానీ వారి విజయానికి వరుణుడు అడ్డుతగిలాడు. దక్షిణాఫ్రికా గెలిస్తే.. ఒక మ్యాచ్ ఓడిపోయిన పాక్ ఇరకాటంలో పడేదే. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా సెమీఫైనల్ కి వెళ్లాలంటే భారత్, పాక్, బంగ్లా, నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఇక ముందు తపడబోయే ఒక్క మ్యాచ్ లో పరాజయం పొందినా.. నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. ఇప్పుడిదే పాకిస్థాన్ పాలిట వరంగా.. సౌతాఫ్రికా పాలిట శాపంగా మారింది. గ్రూప్ 2 నుంచి సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే ప్రతీ జట్టు 4 మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ +0.450 రన్ రేట్ కలిగి ఉండగా, టీమిండియా +0.050 రన్ రేట్ కలిగి ఉంది. సౌతాఫ్రికా, జింబాబ్వేలు 0.000 రన్ రేట్ కలిగి ఉన్నాయి. ఇక మిగిలిన జట్లు అయిన పాక్, నెదర్లాండ్స్ జట్లు వరుసగా -0.050, -0.450 రన్ రేట్ ను కలిగి ఉన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే.. ఎంతో కొంత రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ముందుకెళ్లేది. దాంతో సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలను మరింతగా పదిలపరుచుకునేది. కానీ వరుణుడు వారితలరాతను సక్లిష్టం చేశాడు.
Here are the updated points tables of both groups after the rain-affected game between South Africa and Zimbabwe.
Bangladesh and New Zealand are leading the group 1 and group 2 points table respectively.#Cricket #CricTracker #T20WorldCup2022 pic.twitter.com/EbEd8AMUtL
— CricTracker (@Cricketracker) October 24, 2022