ఏ విషయంపై కూడా పెద్దగా స్పందించని టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక్క ట్వీట్ పెను సంచలనం సృష్టించాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు అదిరిపోయే పంచ్‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. షమీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెట్ వర్గాల్లో సైతం షమీ ట్వీట్‌పైనే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ శాంతంగా ఉండే షమీ.. ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం ఇప్పటి వరకు జరగలేదు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా సైబర్ దాడిని ఎదుర్కొని వార్తల్లో నిలిచిన షమీ.. మళ్లీ ఈ వరల్డ్ కప్ తర్వాత అక్తర్‌కు కౌంటరిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ‘సారీ బ్రదర్.. ఇట్స్ కాల్ కర్మ’ అంటూ అక్తర్‌కు పంచ్ ఇచ్చాడు షమీ.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. సూపర్ 12 స్టేజ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడిన పాకిస్థాన్ నెదర్లాండ్స్ సౌతాఫ్రికాను ఓడించడంతో అదృష్టం కొద్ది సెమీస్‌కు చేరింది. ఇక సెమీస్‌లో న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై విజయం సాధించి ఫైనల్ చేరడంతో.. కప్పు తమదే అన్న రితీలో పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆకాశంలో తేలియాడారు. కానీ.. తీరా ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి.. రన్నరప్‌గా నిలిచింది. ఈ ఓటమితో అక్తర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పగిలిన హృదయం ఎమోజీని పోస్ట్ చేశాడు. పాక్ ఓటమితో తన గుండె పగిలిందని చెబుతూ.. అక్తర్ ఆ ఎమోజీ పోస్ట్ చేశాడు. దీనికి షమీ రిట్వీట్ చేస్తూ.. ‘సారీ సోదరా.. దీన్నే కర్మ అంటారు’ అని పేర్కొన్నాడు.
తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలచే షోయబ్ అక్తర్.. టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన సమయంలో పాక్ జట్టును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన అక్తర్.. లక్ కొద్ది పాక్ టీమ్ సెమీస్ చేరడంతో.. యూటర్న్ తీసుకుని తమ ఆటగాళ్లు తోపులు, తురుములు అంటూ భజన మొదలెట్టాడు. ఇక సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరడంతో కప్పు అప్పుడే కప్పు గెలిచేసినంత పని చేశాడు. ఇక రెండో సెమీస్‌లో భారత్ ఓడి టోర్నీ నిష్క్రమించడంతో రాక్షసానందం పొందుతూ.. టీమిండియా బౌలర్లను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. పాకిస్థాన్ బౌలింగ్ ఎటాక్‌తో టీమిండియా బౌలర్లను పోలుస్తూ.. చేతకాని బౌలింగ్ విభాగం అంటూ కామెంట్ చేశాడు. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒళ్లు మండిన షమీ సరైన టైమ్ కోసం వేచి చూశాడు. ఫైనల్లో పాక్ టీమ్ ఓడిపోవడంతో ఆ టైమ్ రానే వచ్చింది. అక్తర్ గుండెపగిలిన ట్వీట్‌కు.. తమను అవమానించిన కర్మకు ఫలితమే ఇది అనే ఉద్దేశంతో ట్వీట్ చేశాడు.
Sorry brother
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
— Mohammad Shami (@MdShami11) November 13, 2022