టోర్నీ ఏదైనా సరే.. భారత్-పాక్ మ్యాచే హాట్ ఫేవరెట్. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అది మినీ సైజ్ యుద్ధం లాంటిది. కేవలం ఈ రెండు దేశాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం.. ఈ మ్యాచ్ కోసం పిచ్చిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ.. టీమిండియా ఏదైనా టోర్నీ నుంచి బయటకొచ్చేస్తే మాత్రం క్రికెట్ ప్రేమికులు మిగతా మ్యాచులు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. ఇది మేం ఏదో కల్పించో చెబుతున్నది కాదు.. స్వయానా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఈ విషయం చెప్పాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. భారత్-పాక్ జట్ల మధ్య ఆదివారం సూపర్ 12 మ్యాచ్ జరిగింది. నరాలు తెగ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ పూర్తిగా తడబడింది. 10 ఓవర్లు అయ్యేసరికి 45/4 పరుగులతో ఉండేసరికి అందరూ భారత్ ఓటమి ఖాయమని ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో పాత కోహ్లీ బయటకొచ్చాడు. ఛేజింగ్ లో సింహంలా విరుచుకుపడ్డాడు. ఫలితంగా మ్యాచ్ లో భారత్ అపురూప, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ.. క్రికెట్ లవర్స్ కి మర్చిపోలేని ఇన్నింగ్స్ ని అందించాడు. పాక్ అంటే తన చెలరేగిపోవడం పక్కా అని ప్రూవ్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క క్రికెటర్ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు మీడియా సమావేశం జరిగింది. ఇందులో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ పై ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నిజానికి వరల్డ్ కప్ 2022ని భారత్-పాక్ మ్యాచ్ తో ఆపేయాలనుకుంటున్నాను. టోర్నీలో ఇంతకంటే అద్భుతంగా మ్యాచులు ఉంటాయని అనుకోవట్లేదు. ఈ మ్యాచ్ చూడటానికి ఎప్పుడు సూపర్ గానే ఉంటుంది. ఇక ఈ పోరుని లైవ్ లో చూస్తే అంతకంటే బ్యూటిఫుల్ మెమొరీ ఉండకపోవచ్చు’ అని నవ్వుతూ మార్ష్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి. ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
“We should just stop the World Cup there,” Mitchell Marsh on India vs Pakistan match #INDvPAK #ViratKohli #MitchellMarsh #Australia #T20WorldCup #CricketTwitter #OneCricket pic.twitter.com/Krr3CjpvBS
— OneCricket (@OneCricketApp) October 24, 2022
A packed MCG chanting for Virat Kohli 🏟
Raw vision: Behind the scenes of India’s sensational win 📹
Goosebumps. #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MNjmOLKO7r
— ICC (@ICC) October 23, 2022
Special win. Thank you to all our fans for turning up in numbers. 🇮🇳💙 pic.twitter.com/hAcbuYGa1H
— Virat Kohli (@imVkohli) October 23, 2022