టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఒక ప్రపంచ రికార్డు సైతం బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచ కప్పుల్లో అత్యధిక పరుగులు చేసిన మహేల జయవర్దనే రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ సరికొత్త రికార్డును బ్రేక్ చేశాడు. 2007 నుంచి టీ20 వరల్డ్ కప్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీ20 వరల్డ్ కప్స్‌లో జయవర్దనే మొత్తం 1016 పరుగులు చేశాడు. కోహ్లీ బ్రేక్ చేయడం కంటే ముందు ఇదే వరల్డ్ రికార్డుగా ఉంది. ఈ రికార్డును కోహ్లీ బంగ్లాతో బ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం 1065 పరుగులతో కోహ్లీ టీ20 వరల్డ్ కప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లే.. కోహ్లీ మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దీంతో తన స్కోర్ మరింత పెరిగే ఛాన్స్ కచ్చితంగా ఉంది. అయితే.. తన ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడంపై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే స్పందిస్తూ.. ‘రికార్డులు బ్రేక్ చేసేందుకే నిర్మించబడతాయి. నా రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం ఎంతో సంతోషం ఉంది. అతనో వారియర్. అయినా.. ఫామ్ ఎప్పటికీ తాత్కాలికమే. క్లాస్ పర్మినెంట్’ అంటూ తనదైన శైలిలో స్పందించాడు.
అయితే ఈ వరల్డ్ కప్, ఆసియా కప్ 2022 కంటే ముందు విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేడని విమర్శలు వచ్చాయి. తను పరుగులు చేస్తున్నా.. కోహ్లీ నుంచి సెంచరీ రావడం లేదంటూ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీపై విమర్శలు గుప్పించారు. ఒకనొక దశలో కోహ్లీ పని అయిపోయిందంటూ.. రిటైర్మెంట్ ఇచ్చేయడం బెటర్ అంటూ అతని టాలెంట్‌ను అపహాస్యం కూడా చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం కోహ్లీని ఎంపిక చేస్తారో లేదో అనే అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. కానీ.. ఆసియా కప్ 2022లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. అదే టోర్నీలో అఫ్ఘానిస్థాన్‌పై 122 పరుగులు బాది తన 71వ సెంచరీ పూర్తి చేసుకుని.. ఆ బరువును దించేసుకున్నాడు. ఇక ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ ఎలా చెలరేగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి నాటౌట్‌గా నిలిచాడంటేనే అర్థం అవుతుంది కోహ్లీ గొప్పతనం. అందుకే అతని ఫామ్ తాత్కాలికం… క్లాస్ పర్మినెంట్ అంటూ జయవర్దనే కితాబిచ్చాడు.