ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ బీలో ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా భారత్‌కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక సూపర్ 12లో జింబాబ్వేతో మిగిలిన ఆ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలిస్తే.. టీమిండియా టేబుల్ టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఈ ఆదివారం టీమిండియా.. జింబాబ్వేతో తలపడనుంది. అయితే.. ఈ టోర్నీలో జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం నమోదు చేసిన జింబాబ్వేను టీమిండియా తేలికగా తీసుకోకూడదు. పైగా టీమిండియాకు ఇది ఒక విధంగా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచే. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఉన్న ప్రధాన సమస్య ఓపెనింగ్ జోడి వైఫల్యం.
ఇప్పటి వరకు టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ అయ్యారు. నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించినా.. కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మళ్లీ ఇద్దరూ విఫలం అయ్యారు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 50 కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. కానీ.. రోహిత్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇలా ఇద్దరు ఓపెనర్లు విఫలం అవుతూ.. టీమిండియాకు మంచి స్టార్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో టీమిండియాకు పవర్‌ప్లేలో రావాల్సినన్ని రన్స్ రావడం లేదు. కాగా.. తాజాగా బంగ్లాతో మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీపై స్పందించాడు.
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన ఫన్నీ చిట్‌చాట్‌లో రాహుల్ బంగ్లాదేశ్‌పై ఆడిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ..‘గత మూడు మ్యాచ్‌ల్లో విఫలం అయినా ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు నా మైండ్‌లో రాలేదు. ఇది వరల్డ్ కప్ కాబట్టి నాపై అంచనాలు ఉంటాయి. వాటిని తొలి మూడు మ్యాచ్‌ల్లో అందుకోలేదని కొంత నిరాశ చెందా. కానీ.. బంగ్లాదేశ్‌తో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా నా రిథమ్‌కు నాకు వచ్చింది. ఇక మ్యాచ్‌కు ముందు పిచ్ చూసేందుకు నేను, యుజీ(యుజ్వేంద్ర చాహల్) వెళ్లాం. అప్పుడు అతను పిచ్ చూసి.. ఈ పిచ్‌పై లైన్‌పై ఆడి పుల్ షాట్ ఆడాలని చెప్పారు. నేను నా మొదటి సిక్స్‌ను అలానే కొట్టాను’ రాహుల్ తెలిపాడు.
Scoring a cracking 5⃣0⃣ 🙌
Holding nerve in last over 👍
Hard-work behind the scenes 👌@yuzi_chahal chats with @klrahul & @arshdeepsinghh and Fielding Coach T Dilip post #INDvBAN #T20WorldCup clash. 👏 👏 – By @RajalAroraChahal TV Special 🔽 #TeamIndiahttps://t.co/BLmtUkP44R pic.twitter.com/ql8nRnpjDp
— BCCI (@BCCI) November 3, 2022