క్రికెట్ మ్యాచ్ లోని ఓ ఓవర్ లో 36 పరుగులు చేస్తే చాలు సూపర్, బంపర్ అని ఓ గెంతులేస్తాం. అలాంటిది కేవలం ఒక్క బంతికి 14 పరుగులు చేస్తే.. హా అవునా అని ఆశ్చర్యపోవద్దు. నమ్మడానికి వింతగా ఉన్నా సరే ఇదే నిజం. అది కూడా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఇక విషయనికొస్తే.. టీ20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాని కేఎల్ రాహుల్, కోహ్లీ ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్ ల్లో విఫలమైన రాహుల్.. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బ్యాటుతో ఎంటర్ టైన్ చేసిన కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే షోరిఫుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ లో నాలుగో బంతిని లాంగాన్ దిశగా, కేఎల్ రాహుల్ భారీ సిక్సు కొట్టాడు. అయితే అది నో బాల్ గా తేలడంతో ఫ్రీ హిట్ లభించింది. ఎలానూ ఆ బంతి కౌంట్ లోకి రాదు కాబట్టి.. మొత్తం ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతి వైడ్ వేయడంతో ఫ్రీ హిట్ అలానే ఉండిపోయింది. మరో పరుగు కూడా లభించింది. ఇక ఆ తర్వాత బాల్ కి ఫ్రీ హిట్ ని యూజ్ చేసుకున్న రాహుల్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సు కొట్టాడు. అలా ఒక్క బంతికి 14 పరుగులు వచ్చాయనమాట.
ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో పాక్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచుల్లోనూ రాహుల్ ఘోరంగా ఫెయిలయ్యాడు. బ్యాటింగ్ లో పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో అతడిపై తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇక బంగ్లాతో మ్యాచ్ కి ముందు ప్రాక్టీసులో రాహుల్ కి కోహ్లీ సలహాలు ఇస్తూ కనిపించాడు. ఇవన్నీ కలిసొచ్చాయో ఏమో గానీ.. ఈరోజు బ్యాటింగ్ లో రాహుల్ మెప్పించే ప్రదర్శన చేశాడు. ఇలా ఫామ్ లోకి వచ్చాడో లేదో ఒక్క బంతికి 14 పరుగులు చేసి వావ్ అనిపించాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చనీయాంశమైంది.
Innings Break!
A solid show with the bat from #TeamIndia! 💪 💪
6⃣4⃣* for @imVkohli
5⃣0⃣ for vice-captain @klrahulOver to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/Tspn2vo9dQ#T20WorldCup | #INDvBAN pic.twitter.com/n6VchSoP7v
— BCCI (@BCCI) November 2, 2022
Superb 5⃣0⃣s from Virat Kohli and KL Rahul help 🇮🇳 set a 185-run target for 🇧🇩🔥
Let’s do this, #TeamIndia 💙#INDvBAN #T20WorldCup pic.twitter.com/MdNuVuKUoW
— Delhi Capitals (@DelhiCapitals) November 2, 2022