టీ20 వరల్డ్ కప్2022 గెలవాలిని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన జట్లకు భారీ షాక్ లే తగిలాయి. ఆస్ట్రేలియా, విండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా లాంటి పెద్ద పెద్ద జట్లు టోర్నీ నుంచి సూపర్ 12 లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో పాక్ పై 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది న్యూజిలాండ్. దాంతో కివీస్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అతడి జిడ్డు బ్యాటింగే కివీస్ ఓటమికి ప్రధాన కారణమని క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేన్ మామకు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కేన్ మామను వదులుకోనున్నట్లు ప్రముఖ క్రీడా వైబ్ సైట్ ఓ కథనంలో వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేన్ విలియమ్సన్.. టీ20 వరల్డ్ కప్ లో ఇటు కెప్టెన్ గా.. అటు బ్యాట్స్ మెన్ గా రెండిట్లోనూ విఫలం అయ్యాడు. అదీ కాక జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు. పాక్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లో జిడ్డు బ్యాటింగ్ తో కివీస్ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కప్ కొట్టాలన్న కేన్ మామ ఆశలు అడియాశలు అయ్యాయి. దాంతో పుట్టెడు బాధలో ఉన్న అతడికి సన్ రైజర్స్ యాజమాన్యం భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం SRH జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేన్ మామను ఐపీఎల్ వేలంలో రీటైన్ చేసుకోకుండా.. వేలంలోకి పంపాలని భావిస్తున్నట్లు క్రీడా వర్గాల సమాచారం.
Kane Williamson could be released by Sunrisers Hyderabad. (Reported by Cricbuzz).
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2022
గత IPL సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన కేన్ మామ 216 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కెప్టెన్ గా.. బ్యాటర్ గా విఫలమైన విలియమ్సన్ ను వదిలించుకోవాలిని సన్ రైజర్స్ యాజమాన్యం చూస్తుందట. టీ20 అంటేనే వేగంగా పరుగులు చేయడం. అలాంటిది టెస్టు, వన్డే బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు ఐపీఎల్ పనికిరాదని యాజమాన్యం భావిస్తోందని క్రీడా వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. అయితే కేన్ మామ జట్టులో ఉంటాడో లేదో డిసెంబర్ 23 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే? ఆ రోజు నుంచే 2023 ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం అవ్వబోతోంది.
— 🤞NAMAN🤞 (@Naman412) November 9, 2022