టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ మ్యాచులు ముగిశాయి. ఇక మిగిలిందల్లా నాకౌట్ పోరే. గెలిస్తే ముందుకెళ్లడం.. లేదంటే ఇంటిదారి పట్టడం. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించాయి. సెమీస్ పోరులో పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడనుండగా, ఇంగ్లాండ్ జట్టు, ఇండియాను ఢీకొట్టనుంది. ఈ నాలుగు జట్లలో ఏ జట్టు అయితే రాబోవు రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తుందో.. వారిదే ప్రపంచ కప్. ఈ క్రమంలో ప్రతి జట్టు గెలుపుకు కోసం చివరివరకు పోరాడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సారధి జాస్ బట్లర్, ఇండియాతో మ్యాచును ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బలమైన జట్టే కావచ్చు కానీ, వారిని ఓడించగల వ్యూహాలు మా దగ్గర ఉన్నాయంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్(A1), ఇంగ్లాండ్(A2).. గ్రూప్-2 నుంచి ఇండియా(B1), పాకిస్తాన్(B2) జట్లు అర్హత సాధించాయి. షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-1లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు(A1), గ్రూప్-2లోని రెండో స్థానంలో ఉన్న జట్టు(B2)తో.. గ్రూప్-2లో మొదటి స్థానంలో ఉన్న జట్టు(B1).. గ్రూప్-1లోని రెండో స్థానంలో ఉన్న జట్టు(A2)తో తలపడాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత జట్టు సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సారధి జాస్ బట్లర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఎదుర్కొనడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామన్న బట్లర్, ఆ జట్టును ఓడించడానికి తమవద్ద అందుకు తగ్గ వ్యూహాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ బలంగా ఉందని, అలాంటి జట్టుపై గెలవాలంటే శ్రమించక తప్పదనీ అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. సూర్యకుమార్‌ను అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా అభివర్ణించిన బట్లర్.. అతడు ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సమర్థుడని వ్యాఖ్యానించాడు. అతణ్ని అవుట్ చేయడానికి ప్రత్యేకంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. అతనిని ఔట్ చేస్తే.. భారత జట్టును ఓడించవచ్చు అన్నట్లుగా బట్లర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక, భారత్- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా నవంబర్ 10న జరగనుంది.
England skipper Jos Buttler heaps praise on the no. 1 T20I batter Suryakumar Yadav.#SuryakumarYadav #JosButtler #India #England #T20I #Cricket #SKY247 #Socialmedia pic.twitter.com/9C1KHNzaK4
— Sky247 (@officialsky247) November 6, 2022