టీ20 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా గురువారం సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడబోతుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై బ్రిటీష్ ప్లేయర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ పై మెుయిన్ అలీ ప్రశంసలు కురిపించగా.. టీమిండియా సారథి రోహిత్ శర్మపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం రోహిత్ శర్మ సారథ్యంపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియాను గొప్ప నాయకత్వంతో రోహిత్ ముందుకు తీసుకెళ్తున్నాడు అని కితాబిచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయలు తీసుకుంటాడని బట్లరు వ్యాఖ్యానించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 మినీ వరల్డ్ కప్ కు టీమిండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. రేపు (గురువారం) జరగబోయే మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఫైనల్ కు దర్జాగా వెళ్లాలని భారత్ భావిస్తోంది. భారత్ ఉన్నఫామ్ దృష్ట అది అంత పెద్ద విషయమేమీ కాదు. అయినప్పటికీ ఇంగ్లీష్ జట్టును తక్కువ అంచనా వేయరాదు అన్నది క్రీడా నిపుణుల వాదన. ఈ నేపథ్యంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ పై ఇంగ్లాండ్ కెప్టెన్ పొగడ్తల వర్షం కురిపించాడు. సండే టైమ్స్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ..”ప్రస్తుతం టీమిండియా అద్భతమైన ఫామ్ లో ఉంది. వారిని అడ్డుకోవడం చాలా కష్టం. పైగా రోహిత్ శర్మ బ్రిలియంట్ కెప్టెన్సీ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని” బట్లర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే టీమిండియా విజయాలకు ప్రధాన కారణం.. రోహిత్ ఆటగాళ్లను స్వేచ్చగా ఆడమని చెప్పడమే అని బట్లర్ అన్నాడు. ఇక రోహిత్ IPLల్లో నాకంటే అనుభవం ఎక్కువ ఉన్నవాడు. అతడు మంచి నిర్ణయాలే తీసుకుంటాడు. కానీ ఆ నిర్ణయాలు ఎల్లవేళలా కరెక్ట్ కాకపోవచ్చని ఇంగ్లాండ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ చుట్టూ ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నప్పటికీ అతడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడని బట్లర్ పేర్కొన్నాడు. అతడు తన సామర్థ్యానికి మించి ఆడుతాడని కితాబిచ్చాడు. అదీ కాక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో ఒకడిగా రోహిత్ ఉన్న విషయాన్ని బట్లర్ గుర్తు చేశాడు. మ్యాచ్ కు ముందు ఒక్కసారిగా టీమిండియా ఆటగాళ్లపై ఈ రేంజ్ లో ప్రశంసలు కురిపించడానికి కారణాలు ఏంటా? అని భారత అభిమానులు ఆలోచిస్తున్నారు.