టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. సూపర్ 12లో టీమిండియా చేతిలో ఓటమి.. ఆ వెంటనే పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాభవంతో పాక్ జట్టు టోర్నీ నుంచి ఇంటికెళ్లడం ఖాయం అనుకున్నారంతా. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం పాక్ టీమ్ చెత్త టీమ్ అని.. ఒక్కడు కూడా టాలెంటెడ్ ఆటగాడు లేడని మండిపడ్డారు. కానీ.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో పాక్‌కు అదృష్టం కలిసి వచ్చి సెమీస్ చేరింది. కలిసొచ్చిన అదృష్టాన్ని రెండు చేతులతో అందుకున్న పాక్.. సెమీస్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి.. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అనుకున్న టీమ్ అందరి కంటే ముందే ఫైనల్‌కు చేరడం విశేషం.
అయితే.. బుధవారం న్యూజిలాండ్‌పై పాక్ విజయం సాధించిన తర్వాత.. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాక్ గెలుపుపై స్పందించారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా సైతం ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. ‘వరల్డ్ కప్‌లో మరో అప్‌సెట్.. వెల్‌డన్ పాకిస్థాన్.. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ న్యూజిలాండ్’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. అమిత్‌మిశ్రా చేసిన ఈ ట్వీట్‌పై పాకిస్థాన్ అభిమానులు మండిపడుతున్నారు. అలాగే ఇంగ్లండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ జాన్ బర్క్ మరింత ఘాటుగా అమిత్ మిశ్రా ట్వీట్‌పై స్పందించాడు. పాక్ విజయంపై అమిత్ మిశ్రా చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
‘నీ ఫ్రస్టేషన్‌ను నేను అర్థం చేసుకోగలను. థర్డ్ క్లాస్ క్రికెటర్.. థర్డ్ క్లాస్ స్టేట్‌మెంట్’ అంటూ జాన్ ట్వీట్ చేశాడు. జాన్ బర్క్ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం.. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయాన్ని అప్‌సెట్‌గా పేర్కొనడమే. సాధారణంగా పెద్ద టీమ్‌పై పసికూన జట్లు విజయాలు సాధిస్తే.. వాటిని అప్‌సెట్లుగా పేర్కొంటున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ ఓడించడం, సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడం అనేవి అప్‌సెట్లు. కానీ.. కివీస్‌ను పాక్ ఓడించడాన్ని అమిత్ మిశ్రా అప్‌సెట్ అని పేర్కొనడంతో పాక్ జట్టును తక్కువ చేసి మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో జాన్ ఆ విధంగా స్పందించాడు. నిజానికి పాకిస్థాన్ సూపర్ 12 స్టేజ్‌లో జింబాబ్వే చేతిలో ఓడి అదృష్టం కొద్ది సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. అయినా.. పాక్-భారత్ మధ్య ఇలాంటి సెటైర్లు కామనే అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
I can understand your frustration, third class cricketer third class statement.#PakvsNz #T20Iworldcup2022 https://t.co/TdgJrLElDk
— John Burke (@SirJohnBurke) November 9, 2022