ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. కప్ కొట్టడమే లక్ష్యంగా ఏడాది నుంచి ప్రణాళికలు రచించినా.. సెమీస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీ ఆరంభానికి 17 రోజుల ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ప్రత్యేకంగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా మెయిన్ టీమ్‌తో ఒక వామప్ మ్యాచ్ కూడా ఆడి.. మంచి ప్రదర్శన కనబర్చింది. ఇక సూపర్ 12లోనూ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అప్పుడే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడ్డారు అభిమానులు. ఇక గ్రూప్‌లో సౌతాఫ్రికా మినహా అన్ని చిన్న టీమ్‌లే కావడంతో టీమిండియా సెమీస్ చేరడం ఖాయమైంది.
అనుకున్నట్లే సౌతాఫ్రికాతో ఓడినా.. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న టీమ్స్‌పై గెలిచి భారత్ సెమీస్ చేరింది. సూపర్ 12లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌తో నెట్టుకొచ్చినా.. టీమిండియా అసలు సత్తా సెమీస్‌లో బయటపడింది. బౌలింగ్‌లో ఏ మాత్రం పస లేదని, ఆస్ట్రేలియా పరిస్థితులకు మన బౌలింగ్ ఎటాక్ సరిపోదని టోర్నీ ముందు నుంచే విమర్శలు ఉన్నా.. కోహ్లీ, సూర్య బ్యాటింగ్‌తో సూపర్ 12లో ఆ లోపాలు పెద్దగా కనిపించలేదు. పాక్‌పై కోహ్లీ గెలిపించగా.. ఒక మిగిలిన ఒకే ఒక్క బలమైన ప్రత్యర్థిపై తేలిపోయాం. చిన్న టీమ్స్‌పై ఎలాగొలా నెట్టుకొచ్చి.. మొత్తానికి సెమీస్‌కు చేరాం. సెమీస్‌లో ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన ప్రత్యర్థి తగిలితే కానీ.. తెలియలేదు, భారత బౌలింగ్‌లో పసలేదని.
స్వింగ్ పిచ్‌లపై కింగుల్లా బౌలింగ్ చేసే భువీ, షమీ, అర్షదీప్‌ను కూడా తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరి సామర్థ్యం వారికుంటుంది. కానీ.. పిచ్‌లకు తగ్గ బౌలింగ్ ఎటాక్‌ను ఎంపిక చేసుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్ పని. వారిది కాని పిచ్‌లపై రాణించాలని వారిపై భారం వేయడం కూడా సమంజసం కాదు. కానీ.. ఆస్ట్రేలియా పిచ్‌లపై చెలరేగే సామర్థ్యం ఉన్న బౌలర్.. టీమిండియాలో లేరని కాదు. కానీ.. వారి రూటే సపరేటూ.. వారి ప్రాధాన్యతలే వేరే. అలాంటి ఒక స్పెషల్ బౌలరే.. ఐపీఎల్ హీరో జస్ప్రీత్ బుమ్రా. దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి టీమిండియా బౌలింగ్ ఎటాక్‌కు బుమ్రా పెద్దదిక్కుగా ఉన్నాడు. అతనే భారత పేస్ బౌలర్లను ముందుండి నడిపిస్తున్నాడు. జట్టులో ప్రధాన బౌలర్, పేస్‌తో మంటలు పుట్టించగల స్పీడ్‌స్టర్. యార్కర్లతో బ్యాటర్లను బొక్కబోర్లా పడేయగల యార్కర్ కింగ్.
ఇంత టాలెంట్ ఉన్న ఈ బౌలర్.. జాతీయ జట్టుకు మాత్రం పెద్దగా అందుబాటులో ఉండడు. మాట్లాడితే గాయం, విశ్రాంతి అంటూ తప్పుకుంటూ ఉంటాడు. అదే ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం.. నిర్విరామంగా 14, 16 మ్యాచ్‌లను రెండు నెలలో వ్యవధిలో ఆడేస్తాడు. కావాలనే టీమిండియాకు ఆడకుండా గాయాలతో పేరుతో బుమ్రా తప్పించుకుంటున్నాడని కాదు. కానీ.. ప్రపంచంలోనే పెద్ద జట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న ఆటగాడు.. వరల్డ్ కప్ లాంటి టోర్నీలు వస్తున్నాయని తెలిసి.. కొన్ని నెలల ముందు నుంచే తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరమైన ఫిట్‌నెస్‌తో రెడీగా ఉండాలి. గాయాల బారిన పడకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే టీమిండియా ప్రధాన బౌలర్ అంటే టీమిండియాకు ఆయువుపట్టు లాంటివాడు కనుక. కానీ.. బుమ్రాలో మాత్రం అలాంటి లక్షణాలు ఏ కొసానా కనిపించవు. టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలనే కసి ఏ మాత్రం కనిపించదు. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికైన తర్వాత గాయపడ్డాడు. కనీసం తాను వరల్డ్ కప్ జట్టులో ఉన్న విషయం తెలిసిన తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌పై బుమ్రా శ్రద్ధ వహించలేదు. బుమ్రా లాంటి ఒక నిఖార్సయిన పేసర్ జట్టులో లేకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటో వరల్డ్‌కప్ సెమీస్‌లో తేటతెల్లమైంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఓటమి సహజమే కానీ.. ఇలాంటి ఓటమి కచ్చితంగా అవమానమే. బుమ్రా వరల్డ్ కప్ టీమ్‌లో ఉండి ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండేదో.. ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ.. బుమ్రా మాత్రం తన అవసరం జట్టుకు ఎంతుందో గుర్తించలేకపోయాడు.
సెమీస్‌లో మనపై గెలిచిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ లాంటి కొంతమంది ప్లేయర్లు.. జాతీయ జట్టు కోసం, ఈ వరల్డ్ కప్ కోసం ఐపీఎల్‌కు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2022లో ఆడకపోవడానికి కారణంగా జాతీయ జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని బెన్ స్టోక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్‌కు ఐపీఎల్‌లో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా కూడా.. అతను జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌ను కాదనుకున్నాడు. అదే.. మన బుమ్రా మాత్రం 2019 నుంచి 2022 వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 60 మ్యాచ్‌లు ఆడితే.. ఆ జట్టు తరుఫున బుమ్రా 59 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అదే టీమిండియా 70 మ్యాచ్‌లు ఆడితే బుమ్రా కేవలం 16 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. ఈ ఒక్క లెక్కతో బుమ్రా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోచ్చు. అందుకే సగటు క్రికెట్ అభిమాని బుమ్రాపై కోపం వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి.. అది బుమ్రాపై కోపం కాదు.. అతని ఆటపై ఉన్న ప్రేమ.. టీమిండియాకు అతని అవసరంపై ఉన్న అవగాహన. అందుకే ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వైఫల్యానికి బుమ్రా కూడా ఒక కారణమని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Boycott IPL so that the Indian Team can focus on international cricket. #BoycottIPL #BCCI pic.twitter.com/YJQiPZqJuY
— ɅMɅN DUВΞY (@imAmanDubey) November 10, 2022
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
— BCCI (@BCCI) November 10, 2022
Bcci should work on work load management of key players like jaddu and bumrah pic.twitter.com/pWLB40rYOU
— Jack👁Reacher (@Doors2Jack) November 10, 2022