టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచులో బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్ చేరినా, కేఎల్ రాహుల్- విరాట్ జోడీ బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. ముఖ్యంగా ఫామ్ లేక సతమతమైన కేఎల్ రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఆతర్వాతి బంతికే షకీబ్ బౌలింగ్ లో ముస్తాఫిజుర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ సారధి షకీబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టుకు శుభారంభము లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ధాటికి తొలి 6 ఓవర్లలో 37 పరుగులు చేసిన భారత జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో చాన్నాళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఆతర్వాతి బంతికే షకీబ్ బౌలింగ్ లో ముస్తాఫిజుర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
love you champ 🏆 #klrahul is back.. vintage Rahul @klrahul ❤️ #KLRahul𓃵 pic.twitter.com/avEHdOmiee
— Aayush sharma (@rajeevaayush1) November 2, 2022
#ViratKohli𓃵 reaction to @klrahul ‘s six #KLRahul𓃵 #KLRahul on fire 🔥😍 pic.twitter.com/bkyjnGzoj3
— Mr.Pavilla (@yugandharkok) November 2, 2022