టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం రెండవ సెమీస్ లో ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి ఫలితాన్నే రాబట్టింది. ఫామ్ కోల్పొయి ఇబ్బందు పడుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. తొలి బాల్ నే బౌండరీ బాది మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన రాహుల్ రెండో ఓవర్ లోనే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో 5 బంతుల్లో 5 పరుగులు చేసి భారత జట్టుకు భారంగా మారాడు. రాహుల్ స్లో బ్యాటింగ్ కారణంగానే రోహిత్ ఒత్తిడి ఎదుర్కొని భారీ స్కోర్లు చేయలేకపోయడనే విమర్శలు సైతం రాహుల్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం విఫలం కావడంతో సోషల్ మీడియా వేదికగా రాహుల్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
కేఎల్ రాహుల్.. కొన్ని రోజుల ముందు టీమిండియాలో ఉన్న అత్యున్నత బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అతడి సొగసైన, కళాత్మకమైన బ్యాటింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. కానీ రోజులు మారాయి.. గత కొద్ది కాలంగా రాహుల్ బ్యాట్ నుంచి పరుగులు రావడం అటుంచితే.. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ ను ఎదుర్కొనడానికే భయపడుతున్నాడు. ఈ ప్రపంచ కప్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లో కేవలం రెండు అర్దశతకాలు మాత్రమే నమోదు చేశాడు. అది కూడా బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లపై సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో 6 మ్యాచ్ ల్లో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు.
Virat: I perform well under-pressure & Rahul’s role in this team is to create that pressure! pic.twitter.com/EeAqUKIzH6
— Ana de Armas stan (@abhithecomic) November 10, 2022
Bola tha…. pic.twitter.com/O1VrbrwND2
— nobody (@prabhat_gusain) November 10, 2022
ఇక కీలకమైన ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో రాణిస్తాడని ఎన్నో ఆశలతో ఉన్న ఫ్యాన్స్ కు మళ్లి నిరాశే ఎదురైంది. రాహుల్ బలహీనతపై దెబ్బకొట్టిన వోక్స్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంఫ్ బాల్ వేయగా రాహుల్ షాట్ ఆడే క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ఐపీఎల్, చిన్నా చితక దేశాల మీదే తన ఆటను చూపిస్తాడని మండిపడుతున్నారు. అదీ కాక ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకే అతడు ఉన్నాడని ఫైర్ అవుతున్నారు. లెక్కల సబ్జెక్ట్ లో రాహుల్ ఓ అర్దం కాని ఫార్మూలా అని, బయాలజిలో డాల్ఫిన్ అని, రాజకీయాల్లో రాహుల్ గాంధీ అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
KL Rahul departs for 5 in 5 balls.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2022
😭😭😭 pic.twitter.com/JyhCYIkn74
— Spider Pant (@pant_spider) November 10, 2022