ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌కు చేరుకుంది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా టీమిండియా సెమీస్ చేరింది. ఈ నెల 10న ఇంగ్లండ్‌తో అడిలైడ్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్ బీ నుంచి అనూహ్యంగా పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరింది. 9న గ్రూప్ ఏ టాపర్ న్యూజిలాండ్‌తో పాక్ తొలి సెమీస్‌లో ఆడనుంది. ఇక భారత్-ఇంగ్లండ్ రెండో సెమీస్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న టీమిండియా మరింత ఉత్సహంతో సెమీస్‌కు సిద్ధమవుతుంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. వీరికి తోడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌లో వస్తే.. టీమిండియాను అడ్డుకోవడం ఎవరి తరం కాదు.
అయితే.. అంతా సెమీస్ పోరు ఎదురుచూస్తుంటే.. మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. టీమిండియా జెర్సీలో ఆ మార్పు చేయాలంటూ ఇండియన్ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా జెర్సీపై బీసీసీఐ లోగో పైన స్టార్లు ఉండే విషయం తెలిసిందే. ఆ స్టార్లను వరల్డ్ కప్‌లు గెలిచిన గుర్తుగా పెడుతున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీపై ఒక స్టార్ ఉంటుంది. అది 2007లో ధోని సారథ్యంలోని టీమిండియా సాధించిన తొలి టీ20 వరల్డ్ కప్‌కు గుర్తు. అలాగే వన్డే మ్యాచ్‌లు ఆడే సమయంలో రెండు స్టార్‌లతో టీమిండియా ఆటగాళ్ల జెర్సీ ఉంటుంది. అది 1983, 2011లో టీమిండియా సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్స్‌కు గుర్తు. అలాగే కొన్ని సార్లు.. వన్డే, టీ20 వరల్డ్ కప్స్‌ను కలిపి మూడు స్టార్లతోనూ కూడా టీమిండియా ఆటగాళ్లు జెర్సీ ధరిస్తారు.
ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఒక స్టార్ ఉన్న జెర్సీతో ఆడుతోంది. ఈ జెర్సీలో ఒక మార్పు కోసం క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి.. ఫైనల్లో కూడా గెలిచి.. ఈ వరల్డ్ కప్ సాధించడం ద్వారా మరో స్టార్‌ను జెర్సీలోని బీసీసీఐ లోగోపై చేర్చాలని.. ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. టీమిండియా జెర్సీపై మరో స్టార్ కావాలి అంటూ స్టేడియంలో ప్లకార్డులతో పాటు సోషల్ మీడియాలో పోస్టులతో తమ డిమాండ్ వినిపిస్తున్నారు. మరీ రోహిత్ సేన క్రికెట్ అభిమానులు డిమాండ్‌ను నేరవేరుస్తుందో లేదో చూడాలి.
Coming soon? #T20WorldCup pic.twitter.com/3V0nptqUun
— ESPNcricinfo (@ESPNcricinfo) November 7, 2022