భారత జట్టంటే.. ఒక జట్టు కాదు. ఒకేసారి మూడు జట్లను బరిలోకి దించగలదు. మూడు నెలల క్రితం భారత జట్టును ఉద్దేశిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలివి. నిజమే? దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో 200కు పైగా ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. మరి వీరందరు ఎక్కడ? టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోని బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఎంతలా అంటే.. కనీసం పసికూన జట్లయినా నెదర్లాండ్స్, నమీబియా బౌలర్లు చూపిన తెగువ కూడా మన బౌలర్లలో ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిని వదిలేసి కొత్త బౌలర్లను చూసుకోవాలంటూ నెటిజన్స్ సూచిస్తున్నారు.
భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి 15 ఏళ్ళు గడిచిపోయాయి. 2007లో ధోని సారధ్యంలో మొదటి సారి పొట్టి ప్రపంచ కప్ ముద్ధాడం. ఇక అప్పటి నుంచి అదొక అందని ద్రాక్షగా మిగిపోయింది. అప్పుడైనా.. ఎప్పుడైనా.. జట్టులో బ్యాటర్లు ఎలానో.. బౌలర్లు అలానే రాణించాలి. కానీ, ప్రస్తుత టీమిండియాను చూస్తే.. బౌలర్లు ఉన్నా లేనట్టే. ఐపీఎల్ లో తప్ప మా ప్రదర్శన ఎక్కడా చూడలేరు అన్నట్లుగా ఆడుతున్నారు. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులోనూ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఇంత దారుణమైన ఓటమికి కారణం.. భారత బౌలర్లే.
Yet another heartbreak for Team India💔 pic.twitter.com/XImssqrpMS
— CricTracker (@Cricketracker) November 10, 2022
భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. వీళ్ళందరూ ఐపీఎల్ లో హీరోలు. టీ20 ప్రపంచ కప్ లో మాత్రం జీరోలు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఐదుగురు ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఒక ఈ మ్యాచులోనే కాదు.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ఇంతే. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఇంతే. వీళ్ళు చెలరేగేదల్లా.. పసికూన జట్లపైనే. అలాంటి మ్యాచుల్లో నాలుగైదు వికెట్లు తీసేసి కెరీర్ బెస్ట్ గణాంకాలు అని చెప్పుకోవడం తప్ప.. మేటి జట్లతో వీళ్ళు రాణించింది లేదు.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
— BCCI (@BCCI) November 10, 2022
ఇంగ్లాండుతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచులో అయితే.. కనీసం వీరిలో పోరాడాలనే కసి కూడా కనిపించకపోవడం మరీ దారుణం. అలెక్స్ హేల్స్- బట్లర్ దాటికి మ్యాచ్ పోయినట్టేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్టు కనిపించారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న వాళ్లు కూడా పరుగెత్తడానికి, బంతిని ఆపడానికి పెద్దగా కష్టపడలేదు, ప్రయత్నించలేదు. భారత బౌలర్లలో కనిపించిన ఈ యాటిట్యూడ్.. సగటు క్రికెట్ ఫ్యాన్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఇలాంటి బౌలర్లతో ఇక్కడిదాకా రావడమే చాలా ఎక్కువని, వరల్డ్ కప్ కాదు కదా! గల్లీ క్రికెట్ కప్ కూడా గెలవలేమంటూ.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Hales&Buttler Played Like This With Indian Bowlers #INDvsENG #BoycottIPL pic.twitter.com/mnoqLHWBhj
— K.S.Reddy (@Shashi26214076) November 10, 2022
Indian bowlers: pic.twitter.com/4QSKvRnQao
— Prayag (@theprayagtiwari) November 10, 2022