‘భారత్ – పాకిస్తాన్..’ ఈ ఇరుదేశాల మధ్య ఉన్న గొడవలు చాలవన్నట్లు మరో కొత్త వివాదం మొదలైంది. అదే.. ఆసియా కప్ 2023 టోర్నీ. వాస్తవానికి ఈ టోర్నీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. దీంతో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జైషా, ఈ టోర్నీ తటస్థ వేదికల్లో జరగొచ్చంటూ బాంబ్ పేల్చాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అదే జరిగితే.. వచ్చే భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేది లేదంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కోడైకూస్తున్నారు. అంతేకాదు.. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23న జగనున్న భారత్- పాకిస్తాన్ మ్యాచును బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెటర్లతో పాటు అధికారులు, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. జై షా చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. రేపు జరగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ గెలువాలని కోరుకుంటున్నట్టు చెప్పిన ఆయన, వద్దు అనుకుంటే పాక్ తో మ్యాచ్‌లు ఆడటం పూర్తిగా మానేయాలంటూ సలహా ఇచ్చారు. “పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడొద్దనుకుంటే ఆడకుండా ఉండండి, దేశం కంటే మీకు క్రికెట్ ముఖ్యమా? పాక్ గడ్డమీద దాయాదితో ఆడేందుకు ఆసక్తి చూపని టీమిండియా ఆస్ట్రేలియాలో ఎందుకు ఆడటం..” అని ప్రశ్నించారు.
“పాక్‌తో మ్యాచ్ ఆడకపోతే ఏమవుతుంది? కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. దేశం కంటే మీకు క్రికెట్ ముఖ్యమా? ఇదేనా ఆట మీద మీకున్న ప్రేమ. రేపు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియదు. ఎవరు గెలిచినా షేర్ షేర్ అని అరుస్తారు. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్. భారత్ గెలవాలని మేం కూడా కోరుకుంటాం. షమీ, మన కుర్రాడు. మహ్మద్ సిరాజ్ పాక్‌ను ఓడించడంలో తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. మ్యాచ్ గెలిస్తే జిందాబాద్ అంటారు.. ఓడిపోతే విమర్శిస్తారు. ఇదెక్కడి పద్ధతి. వాటితో మీకొచ్చే నష్టం ఏంటి? క్రికెట్ మ్యాచ్ అంటే కూడా మీకు మాతో ఇబ్బంది..” అంటూ భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రేపు జరగాల్సిన భారత్, పాక్ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే.
#BreakingNews | Why is India playing against #Pakistan in #Australia?: AIMIM chief minister Asaduddin Owaisi rakes up #BCCI vs. #PCB storm@swastikadas95 with details | @ShivaniGupta_5 live from #Melbourne | Join the broadcast with @akankshaswarups | #T20WC2022 #INDvPAK pic.twitter.com/69pPHc3Kxp
— News18 (@CNNnews18) October 22, 2022