ప్రపంచ క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న పోరు ఏదంటే? అందరూ ముక్తకంఠంతో ఇండియా-పాకిస్థాన్ అని ఠక్కున చెప్పేస్తారు. ఈ దాయాదుల పోరంటే ఒక మినీ యుద్ధమే. పైగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో తలపడితే.. ఆ మ్యాచ్ చూసేందుకు లక్షల్లో ఎగబడతారు. టిక్కెట్ల కోసం అభిమానులు పొటెత్తితే.. టిక్కెట్లు అమ్మకాలు జరిగే ఆల్‌లైన్ సైట్లు క్రాష్ అయిపోతాయి. ఏడాది ముందు అమ్మినా.. టిక్కెట్లని క్షణాల్లో హాట్‌కేకుల్లా అమ్ముడైపోతాయి. ఇక టీవీలకు అతుక్కుపోయే వారికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రోజు మరేపని పెట్టుకోరు. టెక్నాలజీ మరింత వృద్ధి చెందిన తర్వాత హాట్‌స్టార్ యాప్ ద్వారా మోబైల్‌లో కూడా మ్యాచ్ వీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ చివరి బాల్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగి సగటు క్రికెట్ అభిమానికి నరాలు తెగే టెన్షన్‌తో కావాల్సినంత వినోదాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో ఈ మ్యాచ్‌కు హాట్‌స్టార్‌లో భారీగా వ్యూవర్‌షిప్ వచ్చింది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో ఏకంగా 18 మిలియన్ల మంది వీక్షించారు. ఇది గత రికార్డులను తుడిచేసి కొత్త రికార్డుగా నిలిచింది. ఈ భారీ రికార్డు కొంత కాలం పదిలంగా ఉంటుందని భావిస్తే.. ఈ వరల్డ్ కప్‌లోనే బద్దలైంది.
ఇండియా-పాకిస్థాన్ లాంటి ఎవర్‌గ్రీన్ రైవలరీని మించి ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయ కలిగించడం.. వర్షానికి ముందు బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పైచేయి సాధించడంతో.. ఆసక్తికరంగా మారింది. కానీ.. వర్షం ఆగి మ్యాచ్ మొదలైన తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. కానీ.. చివర్లో మళ్లీ బంగ్లా బ్యాటర్లు అసాధారణ ఆటతో భారత శిబిరంలో వణకుపుట్టించారు. ఈ మ్యాచ్ కూడా చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగడంతో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఏకంగా 19 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో భారత్-పాక్ మ్యాచ్ రికార్డు బద్దలైంది. మరి ఈ రికార్డు ఎంతకాలం ఉంటుందో చూడాలి.
Hotstar’s peak viewership in 2022:
India Vs Bangladesh (T20 WC) – 19M.
India Vs Pakistan (T20 WC) – 18M.
India Vs Pakistan (Asia Cup) – 14M.— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2022