ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు కలిసొచ్చే విషయం ఒకటి జరిగింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా ఉన్న టీమిండియా ఆదివారం జింబాబ్వేపై గెలిస్తే.. గ్రూప్ బీ నుంచి టాప్ టీమ్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. గ్రూప్ బీ నుంచి టీమిండియా టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరడం ఎంతో అవసరం. ఎందుకంటే గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. న్యూజిలాండ్-టీమిండియా సెమీస్‌లో తలపడకుండా ఉండాలంటే.. ఈ రెండు జట్లు వాటి వాటి గ్రూపుల్లో టేబుల్ టాపర్స్‌గానే సెమీస్‌లోకి అడుగుపెట్టాలి.
ఇప్పటికే ఐర్లాండ్‌పై భారీ విజయంతో గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ దాదాపు సెమీస్‌కు చేరింది. ఇక రెండో జట్టుగా ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశం ఉంది. ఆ రెండు జట్లలో ఏ జట్టు సెమీస్ చేరినా.. న్యూజిలాండ్‌కు ఉన్న భారీ రన్‌రేట్‌తో ఆ జట్టే టేబుల్ టాపర్‌గా ఉండనుంది. అయితే.. జింబాబ్వేపై టీమిండియా కూడా విజయం సాధిస్తే.. సెమీస్‌లో ఇంగ్లండ్, లేదా ఆస్ట్రేలియా(ఏ జట్టు సెమీస్ చేరితే ఆ జట్టుతో)తో తలపడే అవకాశం ఉంది. గ్రూప్ ఏ టాపర్ గ్రూప్ బీ నుంచి సెకండ్ ప్లేస్‌లో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడనుంది. అలాగే గ్రూప్ బీ టాపర్ గ్రూప్ ఏలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి టీమ్‌తో సెమీస్ ఆడనుంది. ఈ లెక్క ప్రకారం.. టీమిండియా న్యూజిలాండ్‌ను సెమీస్‌లో ఎదుర్కోదు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఎందుకు వద్దంటే..?
సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడొద్దని ఇండియన్ ఫ్యాన్స్ ఎందుకు కోరుకుంటున్నారంటే.. సెమీస్ లాంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు న్యూజిలాండ్‌పై అంత మంచి రికార్డ్ లేదు. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్‌లో ఇప్పటి వరకు భారత్-న్యూజిలాండ్ మూడు సార్లు తలపడగా.. మూడు సార్లు కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. 2007, 2016, 2021 వరల్డ్ కప్స్‌లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అలాగే.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లోనూ టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడొద్దని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అదే న్యూజిలాండ్ ఫైనల్లో ప్రత్యర్థికి వచ్చిన పర్వాలేదు కానీ.. సెమీస్‌లో మాత్రం రావద్దని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారత్-న్యూజిలాండ్ సెమీస్ తలపడే అవకాశం లేదు. దీంతో టీమిండియాకు సెమీస్‌లో పెద్ద గండం తప్పిందని.. ఇక ఈ వరల్డ్ కప్ భారతే గెలుస్తుందని ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.
New Zealand become the first team to qualify for the #T20WorldCup 2022 semi-finals 🔥
— ICC (@ICC) November 4, 2022