టీమిండియా క్రికెటర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే రెచ్చిపోవడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. క్లాస్ గా ఆడినా మాస్ గా ఆడినా సరే హాఫ్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇక తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీకి తోడు యువ బ్యాటర్ సూర్య కుమార్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడారు. దీంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 179 పరుగుల స్కోరు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో పాక్ తో తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతుందనుకున్నారు. అలాంటి సిట్చూయేషన్ లో అద్భుతంగా పోరాడిన కోహ్లీ.. ఒంటిచేత్తే మ్యాచ్ ని గెలిపించాడు.
ఇక ఈ మ్యాచ్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేసిన భారత్.. తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే కేఎల్ రాహుల్ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక గత మ్యాచ్ లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నెదర్లాండ్స్ పై రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా ఆడి 53 పరుగులు చేశాడు. ఇక ఎప్పటిలానే క్లాస్ ఇన్నింగ్స్ తో కోహ్లీ నిలబడ్డాడు. 44 బంతుల్లో 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈసారి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్ బ్యాటింగ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దీంతో 25 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. చివరి బంతిని సిక్స్ గా కొట్టిన సూర్య కుమార్.. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో అర్ధశతకం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
He enjoyed that one, did #KingKohli! 😲
What was your reaction to this jaw-dropping hit over the covers for six?
ICC Men’s #T20WorldCup #INDvNED #BelieveInBlue #ViratKohli pic.twitter.com/bPOqOHD9RU
— Star Sports (@StarSportsIndia) October 27, 2022