టీ20 ప్రపంచ కప్ లో నిలకడగా ఆడుతున్న ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. సూపర్-12 స్టేజులో ఆడిన 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. నేడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అరుదైన మైలురాయి మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ గణాంకాలతో కోహ్లీయే అత్యధిక స్కోరర్. ఇప్పటివరకు 115 అంతర్జాతీయ టీ20లు ఆడిన కోహ్లీ 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 122. తరువాతి స్థానాల్లో వరుసగా.. రోహిత్ శర్మ(3853), మార్టిన్ గుప్టిల్(3531), బాబర్ ఆజాం(3323) ఉన్నారు.
Another milestone for Virat Kohli! pic.twitter.com/sRm8XEkhR8
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2022
Once Legend MS Dhoni Said About Virat Kohli! pic.twitter.com/xOzJYD0796
— DIPTI MSDIAN (@Diptiranjan_7) November 10, 2022