ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో విజేతగా నిలిచేంది ఎవరో రేపు(ఆదివారం) తేలిపోనుంది. ఫైనల్లో పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్లు పోటీ పడనున్నాయి. సూపర్ 12 స్టేజ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్, జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటాయని ఎవరూ ఊహించలేదు. కానీ.. అనుహ్యంగా సెమీస్ చేరిన పాక్, ఇంగ్లండ్.. గ్రూప్ ఏ, బీ టాపర్లయిన న్యూజిలాండ్, భారత్‌లను ఓడించి ఫైనల్ చేరాయి. రేపు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. ఫైనల్ విషయం పక్కన పెడితే.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి ప్రతిష్టాత్మక టోర్నీ అవార్డు ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు కోసం.. ఐసీసీ 9 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ తొమ్మిది మందిలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కనుంది.
అయితే ఈ తొమ్మిది మందిలో టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. అలాగే.. పాకిస్థాన్ నుంచి షదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిదీ, ఇంగ్లండ్ నుంచి సామ్ కరన్, జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, జింబాబ్వే నుంచి సికందర్ రజా, శ్రీలంక నుంచి వనిందు హసరంగా షార్ట్ లిస్ట్‌లో ఎంపికయ్యారు. ఇక టీమిండియా నుంచి ఇద్దరు బ్యాటర్లకు చోటు దక్కింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమర్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ 296 పరుగులతో ఇప్పటికే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. అలాగే మూడు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.
ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. మూడు హాఫ్ సెంచరీలతో 239 పరుగులు చేశాడు. సూపర్ 12లో సౌతాఫ్రికాపై టీమిండియా టాపార్డర్ మొత్తం విఫలమైనా.. సూర్యకుమార్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించి.. భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక జింబాబ్వేపై అయితే 25 బంతుల్లోనే 63 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్‌సైడ్ బాల్‌ను ఫైన్‌లెగ్ మీదుగా సిక్స్ బాదిన షాట్ టోర్నీకే హైలెట్‌గా నిలిచిపోయింది. మరి ఈ తొమ్మిది మందిలో ఎవరికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కుతుందో చూడాలి. ఎక్కువమంది మాత్రం.. విరాట్ కోహ్లీకే ఆ అవార్డు వరిస్తుందని భావిస్తున్నారు. అయితే.. షార్ట్ లిస్ట్ అయిన 9 మందికి ఓటు కూడా చేయవచ్చని ఐసీసీ తెలిపింది. ఓట్ చేసిన వారికి బహుమతులు కూడా ఇవ్వనుంది.
Nine incredible performers are in the running for the Player of the Tournament award 👏
Who is your pick? 👀
🗳 VOTE NOW to stand a chance to win signed merchandise ➡ https://t.co/ukquhKhWVF pic.twitter.com/23NSoOw8bN
— ICC (@ICC) November 11, 2022