టీ20 వరల్డ్ కప్ 2022.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఊర్రుతలుగించింది. సంచలనాలతో మెుదలైన ఈ టోర్నీ.. ఆద్యాంతం ఉత్కంఠతతో కొనసాగుతూ.. రోజు రోజుకు మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు ఓ థ్రిల్లర్ మూవీనే చూపించింది. టైటిల్ ఫేవరెట్ గా దిగిన జట్లు అన్ని నిరాశపరిస్తే.. ఇంగ్లాండ్ జట్టు మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో కప్ ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలోనే ICC టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఎంపికైయ్యారు. ఇక జింబాబ్వే నయా సంచలనం సికందర్ రజా హేమా హేమిలను తలదన్ని ఐసీసీ జట్టు లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జట్టు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ జాతర ముగిసింది. ఇక ఈ టోర్నీలో స్టార్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లే మెరిశారు. అద్భుతమైన ప్రదర్శనతో దిగ్గజాల మనసులులతో పాటు క్రికెట్ అభిమానుల గుండెలను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే ICC టీ20 వరల్డ్ కప్ 2022 జట్టును ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో టీమిండియా తరపునుంచి ముగ్గురు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. ఇందులో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తోపాటు మిస్టర్ 360 గా పేరొందిన సూర్య కుమార్ యాదవ్, 12వ ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా లు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. మిగతా సభ్యులలో టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఓపెనర్లు అయిన అలెక్స్ హేల్స్ తో పాటుగా కెప్టెన్ జోష్ బట్లర్ (C&WK) లు ఓపెనర్లుగా ఎంపికైయ్యారు.
ICC Team of the Tournament (Updated):
1. Alex Hales.
2. Jos Buttler.
3. Virat Kohli.
4. Suryakumar Yadav.
5. Glenn Phillips.
6. Sikandar Raza.
7. Shadab Khan.
8. Sam Curran.
9. Anrich Nortje.
10. Mark Wood.
11. Shaheen Afridi.12th man – Hardik Pandya.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2022
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, జింబాబ్వే సంచలనం సికందర్ రజా, పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్, సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్టె, ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్, బౌలింగ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సామ్ కర్రాన్, పాక్ తురుపు ముక్క షాహీన్ షా అఫ్రిదీ లకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్ కర్రాన్ అద్బుతమైన బౌలింగ్ తో పాక్ వెన్ను విరిచాడు. ఇక ఈ టోర్నీలో 6 మ్యాచ్ ల్లొ 13 వికెట్లు తీశాడు. అయితే శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. అదీ కాక ఆస్ట్రేలియా నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేక పోయారు. ఇక ఈ టోర్నీలో అత్యధిక పరుగులు 242 చేసి విరాట్ తర్వాత రెండవ స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ ప్లేయర్ ఒ డౌడే కు చోటు దక్కకపోవడం విశేషం. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 12 వ ప్లేయర్ గా ఐసీసీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
This is ICC T20 World Cup 2022 Team of the Tournament Pick by Huzaifa Sports and @PakCricpro #PAKvENG #T20WorldCup pic.twitter.com/9N2UDeNo9Z
— Huzaifa Chaudhary (@Huzaifa12916549) November 14, 2022
ICC today announced Team of #T20WorldCup 2022, which includes four England players and two players each from India and Pakistan. One from Zimbabwe, South Africa & New Zealand. pic.twitter.com/S8tZtACDyD
— Jasim Haider (@jasimhaider786) November 14, 2022