టీమిండియా మాజీ సారధి, రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 34వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతనికి ప్రపంచం నలువైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతటి సెలబ్రిటీ అయినా.. క్రికెటర్ అయినా.. కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ్రేషన్స్ చేసుకోవడం మాములే. అయితే కోహ్లీ మాత్రం పుట్టినరోజు వేడుకులు లేవని చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇండియా ఫైనల్ చేరాక.. అది కూడా కప్ గెలిచిన రోజు సెలెబ్రేషన్స్ ఉంటాయని చెప్పి బాంబ్ పేల్చాడు.
కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడుతున్నాడు. భారత్, ఆదివారం జింబాబ్వేతో తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులో విజయం సాధించినా, వర్షం కారణంగా రద్దయినా సెమీస్ చేరడం పక్కా. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లంతా మెల్ బోర్న్ చేరుకున్నారు. జట్టు సహచరులతో కలిసి కోహ్లీ కేక్ కటింగ్ కూడా చేశాడు. ఆపై స్పోర్ట్స్ జర్నలిస్టుల కోరిక మేరకు వారితో ప్రత్యేకంగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీని పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు చెప్పమని అడగగా ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. “నేను.. మీ ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పను. ఎందుకంటే.. మీరు ఇంతకు ముందు నాకు కేక్ పంపలేదు. ఏదేమైనా చారిత్రాత్మక వేదిక అయిన MCGలో నా సెలెబ్రేషన్స్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. వచ్చే వారం ఒక పెద్ద కేక్ కట్ చేయాలనుకుంటున్నాను (T20 వరల్డ్ కప్ ఫైనల్‌ను ఉద్దేశిస్తూ..) అది చాలా రుచిగా కూడా ఉంటుంది..” అంటూ వారికి నవ్వుతూ సమాధామిచ్చాడు.
See how our humble king celebrates his birthday with us!😍 #kingkohli #kohli #viratkohli #viratians pic.twitter.com/09hnxCWaY3
— Sportskeeda (@Sportskeeda) November 5, 2022
కోహ్లీ బర్త్ డే సందర్బంగా బీసీసీఐ కుడా అతనికి విషెస్ చెపుతూ ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే 477 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడని, ఆ మ్యాచుల్లో 24,350 అంతర్జాతీయ రన్స్ స్కోర్ చేశారని బీసీసీఐ తన ట్వీట్‌లో తెలిపింది. అలాగే 2011లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన బృందంలో కోహ్లీ ఉన్నాడని, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులోనూ కోహ్లీ ఉన్నట్లు బీసీసీఐ తన ట్వీట్‌లో తెలిపింది. ఇక కోహ్లీ ఇటీవల పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ చరిత్రాత్మకం. వెన్ను చూపని వీరుడిలా అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి చూపాడు.
4⃣7⃣7⃣ international matches & counting 👍
2⃣4⃣3⃣5⃣0⃣ international runs & going strong 💪
2⃣0⃣1⃣1⃣ ICC World Cup & 2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winner 🏆 🏆Here’s wishing @imVkohli – former #TeamIndia captain & one of the best modern-day batters – a very happy birthday. 👏 🎂 pic.twitter.com/ttlFSE6Mh0
— BCCI (@BCCI) November 5, 2022