ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరింది కానీ.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటి బాటపట్టింది. కాగా.. సెమీస్ వరకు చేరినందుకు టీమిండియాకు కోట్లలో నగదు బహుమతి దక్కనుంది. 4 లక్షల డాలర్లు టీమిండియాకు ప్రైజ్‌మనీగా అందుతాయి. మన కరెన్సీలో 3.22 కోట్లు. అలాగే ఆదివారం ఫైనల్లో విజయం సాధించి విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 13 కోట్లకు పైగా ప్రైజ్‌మనీ దక్కనుంది. అలాగే రన్నరప్‌కు 8 లక్షల డాలర్లు(7.5 కోట్లకు పైగా) ప్రైజ్ ఘనీ దక్కనుంది.
ఇక మనతో పాటు తొలి సెమీస్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా 3.22 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. టీమిండియాకు 3.22 కోట్లతో పాటు సూపర్ 12లో సాధించిన ఒక్కో విజయానికి 40 వేల డాలర్లు 32 లక్షలపైన ప్రైజ్‌మనీ ఇస్తారు. అంటే భారత్ సూపర్ 12లో సాధించిన నాలుగు విజయాలకు కలిపి.. దాదాపు.. 1.6 కోట్ల రూపాయాలు అదనంగా వస్తాయి. అలాగే సూపర్ 12లో గెలిచిన ప్రతి జట్టుకు ఒక్కో విజయానికి 40వేల డాలర్లు ఇవ్వనున్నారు. రద్దు అయిన మ్యాచ్‌లకు ఆ అమౌంట్‌ను పంచుతారు. ఇక సూపర్ 12లో ఆడిన జట్లకు 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఇక క్వాలిఫైర్‌లో ఆడి సూపర్ 12కు వచ్చిన జట్లకు 40 వేల డాలర్లు. ఇస్తున్నారు. ఇక ఫస్ట్ రౌండ్‌లో పాల్గొన్న జట్లుకు కూడా 40 వేల డాలర్లు దక్కుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 5.6 మిలియన్ డాలర్లు.
This is how much money India will receive after crashing out of the T20 World Cup in the semi-finals.#T20WorldCup #IndianCricketTeam #BCCI https://t.co/2w01C26qCi
— CricTracker (@Cricketracker) November 12, 2022