టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకున్నా.. బ్యాటింగ్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడి.. భారత్‌కు ఆ మాత్రం స్కోర్ అయినా అందించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులు చేసి.. చివరి ఓవర్లలో పాండ్యా వీరవిహారం చేశాడు. పాండ్యా ఆడిన ఇన్నింగ్స్‌తోనే.. చప్పగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌లో కాస్త ఊపు వచ్చింది. లేదంటే.. బౌలింగ్‌లో ఉన్న నిర్జీవం బ్యాటింగ్‌లోనూ కనిపించేది.
ఇక సెమీస్‌లో భారత్ ఓడినా.. పాండ్యా ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి పాండ్యా.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తీరు అమోఘం అంటూ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే.. చివరి ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుపడిన పాండ్యా.. ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. ఇన్నింగ్స్ చివరి బంతికి బౌండరీ బాదిన పాండ్యా.. అనుకోకుండా వికెట్లకు తన కాలు తగిలింది. దీంతో పాండ్యా హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. దీంతో ఆ బౌండరీ పరుగులు కూడా భారత్ ఖాతాలో చేరలేదు.
ఇలా టీ20 వరల్డ్ కప్ వేదికపై హిట్ వికెట్‌గా అవుటైన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అడిలైడ్ స్లో పిచ్‌పై ఈ టార్గెట్ టఫ్‌గానే కనిపించినా.. ఇంగ్లండ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడి.. ఈ పిచ్‌పైనా భారత బ్యాటర్లు తడబడింది? అనే అనుమానం కలిగేలా చేశారు. జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో ఇండియా బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటూ.. 169 పరుగుల టార్గెట్‌ను కేవలం 16 ఓవర్లలో ముగించి.. ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
T20 CRICKET WORLD CUP
🇮🇳 India vs 🏴 EnglandWICKET
Hardik Pandya (63 runs scored)
Hit Wicket
b JordanFALL OF WICKET
IND 168 – 6
20.0 oversImage Credits: Astro Cricket pic.twitter.com/HjoTd1xvgJ
— 🇬🇧🇺🇦 VWH Portsmouth | Solidarity with Ukraine (@VWHPortsmouth) November 10, 2022