కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ప్రాణం పెట్టి ఆడుతోంది. అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఆఫ్ఘాన్‌ను 144 పరుగులకే కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 144 పరుగులు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా 4 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కాగా.. ఈ మ్యాచ్ మధ్యలో విచిత్రమైన రనౌట్ చోటు చేసుకుంది. చివరి ఓవర్స్‌లో రన్స్ రాక ఇబ్బంది పడుతున్న క్రమంలో సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చే క్రమంలో అఫ్ఘాన్ బ్యాటర్ గుల్బాదిన్ నాయబ్ రనౌట్ అయ్యాడు. గుల్బాదిన్ రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తీక్షణ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ రెండు బంతిని అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ నబీ మిడ్ వికెట్ వైపు ఆడాడు. ఆ బంతి ఫీల్డర్‌ను చేరడం కంటే ముందే.. నబీ, నాయబ్ ఒక పరుగు పూర్తి చేసుకున్నారు. అప్పటికే అఫ్ఘానిస్థాన్ స్కోర్ 127 మాత్రమే.. దీంతో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతో గుల్బాదిన్ నాయబ్ రెండు పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. నబీ మాత్రం స్పందించలేదు. రెండో రన్ వద్దని నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి వారించాడు. కానీ.. అప్పటికే గుల్బాదిన్ పిచ్ మధ్యకు వచ్చేశారు. నబీ నో చెప్పడంతో తిరిగి క్రీజ్‌లోకి పరిగెత్తిన గుల్బాదిన్.. ఆ కంగారులో స్లిప్ అయి కిందపడ్డాడు. చేతుల్లోంచి బ్యాట్ జారిపోయింది. అయినా కూడా అలాగే పొర్లుతూ..క్రీజ్‌లోకి చేరాడు. కానీ.. అప్పటికే ఫీల్డర్.. కీపర్‌కు బాల్ విసరడం అతను వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. దీంతో గుల్బాదిన్ రనౌట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌కు ఓపెనర్లు గుర్బాజ్, ఉస్మాన్ గని మంచి ఆరంభాన్ని అందించారు. కానీ.. పవర్ ప్లే తర్వాత నుంచి అఫ్ఘాన్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్ 28, ఉస్మాన్ 27, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులతో రాణించారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 144 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను శ్రీలంక ముందు ఉంచింది. ఇక లక్ష్యాన్ని శ్రీలంక సులువుగానే ఛేదించేలా కనిపిస్తోంది. ఇప్పటికే 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఇంకా 29 బంతుల్లో 27 పరుగులు చేస్తే.. లంక గెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలుస్తుంది. ఈ ఓటమితో అఫ్ఘానిస్థాన్ దాదాపు ఇంటికి చేరినట్టే.
— MINI BUS 2022 (@minibus2022) November 1, 2022