ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా విఫలమైన విషయం తెలిసిందే. సూపర్ 12 స్టేజ్‌లో బాగానే రాణించిన టీమిండియా.. సెమీస్‌కి వచ్చేసరికి తేలిపోయింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో సెమీస్‌లో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో భారత జట్టుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీతోనే టీమిండియా వరల్డ్ కప్‌లో విఫలమైందని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారీ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. కాగా.. టీమిండియా మ్యాచ్‌లు ఓడిన సమయంలో క్రికెట్ అభిమానుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం సహజమే కానీ.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఓటమిపై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా టీమిండియాను హేళన చేస్తూ.. ఒక ట్వీట్ చేసింది.
గురువారం ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ట్విట్ చేసింది. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే.. మ్యాచ్ ఓడిన తర్వాత రెండు రోజులు టీమిండియాపై మండిపడిన క్రికెట్ అభిమానులు.. ఇప్పుడు కొంత శాంతించి.. గిన్నిస్ రికార్డు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టును అవమానించేలా ట్వీట్ చేయడంపై మండిపడుతున్నారు. ఇంతకీ గిన్నిస్ బుక్ సంస్థ ఏమని ట్వీట్ చేసిందంటే.. ‘చరిత్రలో ఇదే అత్యంత సులవైన రన్ ఛేజా?’ అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచంలో పలు రికార్డులను నమోదు చేసే సంస్థ.. ఒక క్రికెట్ జట్టును ఇలా అవమానించేలా ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ ఇంగ్లండ్‌కు 169 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ టఫ్ టార్గెట్‌ను ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు. దీంతో ఈ ఛేజ్‌ను గిన్నిస్ బుక్ సంస్థ.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత సులువైన ఛేజా అని పేర్కొంది. అంటే ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్‌ను ఎదుర్కొని.. ఇంగ్లండ్ చాలా ఈజీగా 170 పరుగులు చేసిందని గిన్నిస్ సంస్థ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Easiest run chase in history? 👀#INDvsENG
— Guinness World Records (@GWR) November 10, 2022