ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సూపర్-12 దశకు సంబంధించిన మ్యాచులు శనివారం నుంచి మొదలయ్యాయి. ఇక తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడింది. కానీ కివీస్ జట్టు దెబ్బకు నిలబడలేక ఓడిపోయింది. ఇక ఈ మ్యాచులో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. అదంతా పక్కనబెడితే.. ఓ వండర్ ఫుల్ ఫీట్ కూడా వీక్షకుల్ని కనువిందు చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. 200 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న టైంలో కివీస్ ఫీల్డర్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. శాంట్నర్ వేసిన తన మూడో ఓవర్ తొలి బంతికి.. క్రీజులో ఉన్న స్టోయినిస్ చాలా బలంగా ఆఫ్ సైడ్ కొట్టాడు. దాన్ని గ్రీన్ ఫిలిప్స్ పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరీ సూపర్ క్యాచ్ పట్టాడు. దీన్ని చూసిన క్రికెట్ ప్రేమికులు.. ఫస్ట్ మ్యాచులోనే సూపర్ మ్యాన్ వచ్చేశాడ్రోయ్ అని మాట్లాడుకుంటున్నారు.
ఇక సిడ్నీ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 200 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ రఫ్పాడించాడు. 16 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ఆ తర్వాత విలియమన్స్ క్రీజులోకి రావడంతో.. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న వికెట్ కీపర్ డేవాన్ కాన్వే రెచ్చిపోయాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి.. న్యూజిలాండ్ జట్టు 200 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో ఆస్ట్రేలియా పూర్తిగా తడబడింది. ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్ జట్టు ఓడిపోయింది. మరి గ్రీన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
What a catch by Phillips! 😀 😈🤘🏻
PS: I want to witness such fielding of our boys in green in tomorrow’s match against India! 🤨🤕🥲#T20WorldCup #AUSvNZ pic.twitter.com/Q9bFVxG1GR
— bilalmustafabughio (@bilalbughio55) October 22, 2022