ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా జోరుమీదుంది. 4 మ్యాచ్ ల్లో మూడింట విజయాలతో 6 పాయింట్లు సాధించి సెమీస్ రేసులో నిలిచింది. అయితే టీమిండియాను మాత్రం ఇద్దరి స్టార్ ఆటగాళ్ల ఫామ్ ఇబ్బంది పెడుతోంది. అందులో ఒకరు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అయితే.. మరో ఆటగాడు కేఎల్ రాహుల్. మెున్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించాడు రాహుల్. దాంతో ఇతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. గత కొంత కాలంగా కంటిన్యూస్ గా విఫలమవుతూ వస్తోన్న రాహుల్.. బంగ్లా మ్యాచ్ లో అర్ధశతకం సాధించి టచ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ పై గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కేఎల్ రాహుల్.. టీమిండియా సొగసైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. జట్టుకు ఓపెనర్ గా మంచి మంచి శుభారంభాలు అందిస్తూ.. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పొయి ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో ఇతడిపై ఇంటా.. బయట విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ కారణంగానే ఒత్తిడికి గురై.. రోహిత్ భారీ స్కోర్లు చేయలేక వెంటనే అవుట్ అవుతున్నాడని అభిమానులు ట్రోల్స్ చేశారు. దాంతో వాటన్నింటికీ రాహుల్ బంగ్లాపై అర్దశతకంతో సమాధానం ఇచ్చాడు. కీలక మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చి టీమిండియాకు అద్భతమైన విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అతడిపై ప్రశంసలు కురిపించాడు.
తాజాగా రాహుల్ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ..”ప్రతీ ఆటగాడి జీవితంలో కొన్ని రోజులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఏదో ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగానే ప్లేయర్ సామర్థ్యాన్ని నిర్వచించలేం. ఆడితే గొప్పవాడని, ఆడకపోతే చడ్డవాడని అనలేం. రాహుల్ లాంటి ఆటగాళ్లకు కొంత సమయం ఇవ్వాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాహుల్ కొట్టిన ఆ ఒక్క షాట్ తోనే అతడు ఎంత గొప్ప ఆటగాడో తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ ఫామ్ ను అందుకున్నాడు. అసలు అతడు ఫామ్ ను కోల్పోలేదని” గంభీర్ చెప్పుకొచ్చాడు. జరుగుతుంది మెగా టోర్నీ కాబట్టి ప్రపంచ మెుత్తం మీ ఆటను చూస్తుంది. దాంతో ఎంతో కొంత ఒత్తిడి అనేది ఆటగాడిపై ఉంటుందని గంభీర్ అన్నాడు. ఇకపోతే మ్యాచ్ ను సరిగ్గా ఆరంభించకపోతే.. అతడిని నిందించాల్సిన అవసం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆడుతున్న తీరు అమోఘమని, అది అతడికి మాత్రమే సాధ్యమని కితాబిచ్చాడు గౌతమ్. ఒక్కసారి రాహుల్ ఫామ్ అందుకుంటే.. అతడిని ఆపడం కష్టమని గంభీర్ ప్రశంసించాడు.