యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ రానే వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో క్వాలిఫయర్స్ దశ ముగిసి.. సూపర్ 12 పోటీలు ఆరంభం అయ్యాయి. తొలి మ్యాచ్‌లో అతిథ్య ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతుండగా.. టీమిండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. అలాగే టీమిండియాను వరల్డ్‌కప్ వేదికలపై ఏనాడు ఓడించని పాకిస్థాన్.. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆ విజయం సాధించింది. అదే టెంపోను కొనసాగించాలని బాబర్ సేన కూడా భావిస్తోంది.
ఇక పోటీపై ఒక రేంజ్‌లో అంచనాలు ఉంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఎలాంటి టీమ్‌తో బరిలోకి దిగాలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించాడు. గంభీర్ మాట్లాడుతూ..‘నేనైతే మొహమ్మద్ షమీని, అలాగే రిషభ్ పంత్‌ను తుది జట్టులో ఆడిస్తాను.’ అని అన్నాడు. అందుకు తన వద్ద కారణాలు కూడా ఉన్నాయని గంభీర్ పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో షమీని అలాగే దినేష్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఆడించాలని ఎందుకంటే.. పది బంతుల కోసం ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. కార్తీక్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదో, లేక అతనికి వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదో తెలియదుకానీ.. కార్తీక్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవని.. అదే పంత్ అయితే రెండు మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌ను నిలబెడతాడని గంభీర్ అభిప్రయపడ్డాడు.
అలాగే పాకిస్థాన్‌తో బరిలోకి దిగే జట్టులో ముగ్గురు పేసర్లు ఉండాలని.. అందులో అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్‌తో పాటు షమీని తీసుకోవాలని చూసించాడు. అందుకోసం భువీ పక్కన పెట్టాలని పేర్కొన్నాడు. ఇక జట్టులో యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారని గంభీర్ తెలిపాడు. కానీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ దినేష్ కార్తీక్‌నే బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా.. అతను దారుణంగా విఫలం అయ్యాడు. అలాగే టాపార్డర్‌లో ఏ ఇద్దరూ క్లిక్ అయినా.. చివరి వరకు బ్యాటింగ్ రావడం కష్టమే ఒకవేళ చివర్లో బ్యాటింగ్ వచ్చినా.. దినేష్ కార్తీక్ అయితే మంచి ఫినిష్ ఇస్తాడు. అలాగే ప్రెషర్‌ను తట్టుకుని బ్యాటింగ్ చేయగలడు. అందుకే పాక్‌తో మ్యాచ్‌లో డీకేనే ఆడే అవకాశం ఉంది.
Dinesh Karthik or Rishabh Pant? 🤔
Arshdeep Singh or Harshal Patel? 🤔
Gautam Gambhir picks his India’s playing XI for the clash against Pakistan.#T20WorldCup #INDvPAK #T20WorldCup2022https://t.co/Yhi5yLveG5
— CricTracker (@Cricketracker) October 21, 2022