ది ఫినిషర్ దినేష్ కార్తీక్.. ఇక తన క్రికెట్ కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న డీకే.. ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డీకే.. 18 ఏళ్ల కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్ టీమ్‌లో డీకే కూడా సభ్యుడే. అలాగే 2018లో నిధాస్ ట్రోఫీ సందర్భంగా బంగ్లాదేశ్‌పై ఆడిన ఇన్నింగ్స్ దినేష్ కార్తీక్ కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించి.. విజేతగా నిలిపిన ఆ మ్యాచ్ ఒక విధంగా డీకే కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.
ఇక టీమిండియాలో మహేంద్రసింగ్ ధోని హవా నడవడంతో డీకేకు దక్కాల్సినంత గుర్తింపు, అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలో జాతీయ జట్టులోకి వస్తూ పోతూ నెట్టుకొచ్చాడు. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లకు ఆడినట్లు ఉన్నాడు. ఆటతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలతో ఒకానొక దశలో డీకే క్రికెట్‌కు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టి కామెంట్రీ చేసేందుకు బ్యాట్ వదిలేసి మైక్ కూడా పట్టుకున్నాడు. కానీ.. తన దారి ఇది కాదని తన రెండో భార్య, స్నేహితుడి సలహా, ప్రొత్సాహంతో మళ్లీ బ్యాట్ పట్టిన డీకే.. ఐపీఎల్ 2022లో సూపర్ సక్సెస్ అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఆడి.. ఫినిషర్ అవతారమెత్తాడు. అంతే.. మళ్లీ టీమిండియాలో చోటు దక్కడంతో పాటు టీ20 వరల్డ్ కప్ కోసం కూడా ఎంపికయ్యాడు.
కానీ.. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో విఫలం అవ్వడంతో పాటు ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. పైగా వయసు కూడా మీదపడుతుండటంతో ఇక తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేననే విషయం డీకే కు అర్థమై ఉంటుంది. దానితోపాటు.. ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత దినేష్ కార్తీక్‌ను టీ20లకు కోసం పరిశీలనలోకి తీసుకోకూడదని ఇప్పటికే సెలెక‌్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సైతం పరిగణంలోకి తీసుకున్న డీకే.. వరల్డ్ కప్ తర్వాత తన కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దినేస్ కార్తీక్ క్రికెట్ జీవితం మాత్రం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికవ్వడం.. ఆపై ధోని లాంటి ప్లేయర్ హవాను సైతం తట్టుకుని అతని కంటే లాంగ్ కెరీర్‌ను కొనసాగించడం.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని, 37 ఏళ్ల వయసులో టీమిండియాలో రిఎంట్రీ ఇవ్వడం నిజంగా ఎందరికో స్ఫూర్తినిచ్చే అంశాలే.. డీకే జీవితమే ఒక స్ఫూర్తి పాఠం.
Dinesh Kartik’s career may not reflect lot of achievements but his main achievement has been inspiring people not to give up,just give that one final push when you feel it’s the end.All the best whats next,a thrilling international carrer.hope it ends with a medal & trophy 🤞❤️🙏🏽
— Archisman Mishra (@iamarchis16) October 31, 2022
Appreciation tweet for Dinesh Karthik keeping 🐐🛐🤍
He saved atleast 10+ runs#dineshkartik #INDvsPAK #PKMKB pic.twitter.com/ihNMGwT2NZ— 133* 𓃵 (@133_NotOut) October 23, 2022