టీ20 ప్రపంచ కప్ 2022.. రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడిపోతున్నాయి.. ఓడిపోతాయి అనుకున్న జట్లు విజయం సాధిస్తున్నాయి. దాంతో జరగబోయే మ్యాచ్ లపై ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. టోర్నీలో పాక్ పై గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియాకు.. సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో భారత్ పరాజయం పాలైంది. అయితే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్ లో గాయపడ్డాడు. దాంతో అతడు గ్రౌండ్ ను వదిలి బయటకి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వరల్డ్ కప్ టోర్నీ ముందు నుంచే టీమిండియాను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గాయాల కారణంగా స్టార్ బౌలర్లు దూరం అయినప్పటికీ.. మెగా టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టింది. కానీ ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అన్ని రంగాల్లో విఫలం అయ్యి.. ఓటమిని చవిచూసింది. తాజాగా జరిగిన ఈ మ్యాచ్ లో స్టార్ ఫినిషర్ కమ్ వికెట్ కీపర్ అయిన దినేశ్ కార్తీక్ గాయపడ్డాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్ పూర్తి అయిన తర్వాత.. వెన్ను నొప్పితో డీకే మైదానంలోనే కూర్చున్నాడు. దాంతో వెంటనే ఫిజియో వచ్చి.. అతడికి చికిత్స అందించాడు.
.@DineshKarthik walks of the field & @RishabhPant17 takes keeping duties.
📸: Disney + Hotstar pic.twitter.com/MnuB2qC4DE
— CricTracker (@Cricketracker) October 30, 2022
అనంతరం దినేశ్ కార్తీక్ కీపింగ్ చేయలేని స్థితిలో ఉండటంతో మైదానం వీడాల్సి వచ్చింది. డీకే స్థానంలో పంత్ వికెట్ కీపర్ గా వచ్చాడు. గాయం కారణంగా బంగ్లాదేశ్ తో నెక్ట్స్ జరగబోయే మ్యాచ్ కు డీకే అందుబాటులో ఉండడు అని PTI వార్తా పత్రిక తెలిపింది. అయితే డీకే గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తర్వాత మ్యాచ్ కు డీకే అందుబాటులోకి రాకుంటే.. అతడి స్థానంలో రిషబ్ పంత్ టీమ్ లోకి రానున్నాడు. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ కు ఇది మంచి అవకాశం అని, అతడు తన సత్తాను నిరూపించుకోవాలని.. అభిమానులతో పాటు.. క్రీడానిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.