టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బాగానే ఆడినప్పటికీ ఫైనల్ కి మాత్రం చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టేసింది. అయితే భారత జట్టు కొన్ని విషయాల్లో ఫెయిలైనప్పటికీ.. కొన్నింట్లో మాత్రం సక్సెస్ అయింది. సూర్యకుమార్ యాదవ్ ఎంతటి అద్భుతమైన బ్యాటరో అందరికీ తెలిసింది. ఇదే వరల్డ్ కప్ వల్ల పాత కోహ్లీ కూడా బయటకొచ్చాడు. బుమ్రా లేకపోయినా సరే మన బౌలర్లు కొంతమేర ఆకట్టుకున్నారు. ఇలా టీమిండియా గురించి మిక్స్ డ్ గా మాట్లాడుతున్న ఈ టైంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్.. ఒకే ఒక్క మాట చెప్పాడు. భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టులో ఏదైనా మంచి విషయం ఉందంటే అది సూర్య కుమార్ యాదవ్ మాత్రమే. ఎందుకంటే అదిరిపోయే బ్యాటింగ్ చేసిన సూర్య.. విమర్శకులు, ప్రత్యర్థి జట్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ తో ఫైనల్ కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన బట్లర్.. సూర్యకుమార్ ని ఆకాశానికెత్తేశాడు. గత కొంతకాలంగా అతడి ఆటతీరు అద్భుతంగా ఉందని, గ్రౌండ్ కి అన్నివైపులా కొడుతున్న షాట్లు.. క్రికెట్ బుక్ లోనూ ఎక్కడా లేవని తెగ మెచ్చుకున్నాడు. మిస్టర్ 360 అని పిలిపించుకోవడానికి అతడు వందశాతం అర్హుడని పేర్కొన్నాడు.
సూర్యకుమార్ షాట్స్ తనని చాలా ఆకట్టుకున్నాయని, అవి తనకు ఏబీ డివిలియర్స్ ని గుర్తుచేశాయని బట్లర్ చెప్పాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకునేందుకు అన్ని విధాల అర్హుడని, ఐసీసీ లిస్టు చేసిన 9 మందిలో తన ఓటు సూర్యకే అని అన్నాడు. ఇక దీని కోసం ఐసీసీ ఎంపిక చేసిన ఆటగాళ్లలో సూర్యకుమార్ తోపాటు విరాట్ కోహ్లీ, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, సామ్ కరన్, బట్లర్, అలెక్స్ హేల్స్, సికిందర్ రజా, హసరంగ ఉన్నారు. మరి బట్లర్, సూర్యకుమార్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#SuryakumarYadav — India’s very own Mr. 360.#INDvsZIM | #T20WorldCup pic.twitter.com/EhyxyzBXvH
— P C Mohan (@PCMohanMP) November 6, 2022
Well Done Surya 🏏🔥#SuryakumarYadav pic.twitter.com/I9uiRb1Hm2
— Shikha Yadav (@ShikhaYadav000) November 6, 2022
Jos Buttler & Babar Azam with the T20 World Cup Trophy. pic.twitter.com/yHMOIFx2zx
— Johns. (@CricCrazyJohns) November 12, 2022