టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌ల్లో పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్ సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. బుధవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో సెమీస్‌లో పోటీ పడనుంది. రెండో సారి వరల్డ్ కప్ సాధించేందుకు ఉవ్విళూరుతున్న ఈ ఇండియా-ఇంగ్లండ్.. సెమీస్‌లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు టోర్నీలో ఏ విజయంలో తామ మెరుగ్గా ఉన్నామో వాటిని మరింత పదును పెడుతూ.. వీక్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ను మెరుగుపర్చుకుంటున్నారు.
ఇప్పటికే ఇరు జట్లు నెట్ సెషన్స్‌లో ముగిపోయాయి. ఎలాగైనా సెమీస్ గండం దాటి.. ఫైనల్ పోరుకు సిద్దమవ్వలాని బలంగా కోరుకుంటున్నాయి. అయితే సెమీస్‌లో విజయావకాశాలు ఎలా ఉన్నా.. ఇప్పటికైతే టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఇంగ్లండ్ జట్టులో 8వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నా కూడా.. ఎవరూ నిలకడగా రాణించలేకపోవడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది. మరీ టీమిండియాలో అయితే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్‌లో ఉన్నారు. గత రెండు మ్యాచ్‌ల నుంచి వీరికి కేఎల్ రాహుల్ సైతం తోడయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో ఎవరూ చెప్పలేరు. ఇంగ్లండ్ ఖర్మకాలి సెమీస్‌లో హిట్‌మ్యాచ్ ఫామ్‌లోకి వస్తే.. అగ్నికి ఆజ్యం పోసినట్లే. ఇక టీమిండియాను ఆపడం ఇంగ్లండ్ తరం కాదు.
ఇదే విషయంపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. టీమిండియాతో సెమీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బెన్.. సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురించాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటగాడని.. ప్రస్తుతం అతను భీకర ఫామ్‌లో ఉన్నాడని, అతను ఆడే షాట్లు నమ్మశక్యంగా లేవని అన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ సెమీస్‌లో తమపై ఆడొద్దని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అతన్ని త్వరగా అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. కాగా.. సూర్య ఈ టోర్నీలో ఇప్పటికే 3 హాఫ్ సెంచరీలు బాది 225 పరుగులతో టోర్నీ టాప్ 3 రన్ గెట్టర్‌గా ఉన్నాడు. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అయితే సూర్య విశ్వరూపం చూపించాడు. 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. మరీ సెమీస్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించాస్తాడో చూడాలి.
Ben Stokes: Can’t believe some of the shots Suryakumar Yadav plays 🇮🇳 #SuryakumarYadav @surya_14kumar pic.twitter.com/mlACdVkPP9
— Sushant Mehta (@SushantNMehta) November 8, 2022