టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గదిలోకి ఓ వ్యక్తి చొరబడిన సంగతి అందరకి తెలిసిందే. లోపలకి వెళ్లిన సదరు వ్యక్తి , ఆ గదిలోని వస్తువులను వీడియో తీసి.. దానిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన కోహ్లీ, ఇది తన ప్రైవసీపై దాడిగా అభివర్ణించాడు. సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను తన ఇన్‌స్టాలో రీపోస్ట్ చేసిన కోహ్లీ, సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. తన ఆవేదనను సైతం వెలిబుచ్చాడు. “తన అభిమాన క్రికెటర్‌ను చూస్తే ఆ ఫ్యాన్ ఎంత సంతోషంలో మునిగిపోతారో అర్థం చేసుకోగలను. ఆ ఉద్వేగాన్ని ఎప్పుడూ ప్రశంసిస్తా కూడాను. కానీ ఇలా రూములోకి చొరబడి వీడియో తీయడం నన్ను తీవ్ర అసహనానికి గురిచేసింది. నా ప్రైవసీపై జరిగిన ఈ దాడి నా మైండ్‌ను బ్లాంక్ చేసింది” అని తెలిపాడు.
కోహ్లీ హోటల్ రూములోకి చొరబడిన వ్యక్తి పోస్ట్ చేసిన వీడియోలో విరాట్ గదిని ఆసాంతం చూపించాడు. అతని వ్యక్తిగత వస్తువులు, ఆరోగ్య సప్లిమెంట్లు, అతడి ధరించే బూట్లు, తెరిచి ఉన్న సూట్‌కేస్, అందులో టీమిండియా జెర్సీ, గదిలో టేబుల్‌పై క్యాప్, కళ్లద్దాలు ఓ టేబుల్‌పై కనిపించాయి. ఈ ఘటనపై సదరు హోటల్ యాజమాన్యం కూడా స్పందించింది. కోహ్లీని క్షమాపణ కోరిన హోటల్ యాజమాన్యం.. వీడియో చిత్రీకరించిన సదరు ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు తెలిపింది. అతను అప్‌లోడ్ చేసిన వీడియోను సోషల్‌మీడియా నుంచి తొలగించినట్టు కూడా ప్రకటించింది. ఈ ఘటన జరిగి రెండు రోజులవుతున్నా నోరు మెదపని బీసీసీఐ ఎట్టకేలకు కళ్లు తెరిచింది.
ఈ ఉదంతంపై స్పందించిన బీసీసీఐ.. “సదరు హోటల్ పై ఏ రకంగా చర్యలు తీసుకుందాం.. అన్న విషయపై కోహ్లీని సంప్రదించినట్లు వార్తలోస్తున్నాయి. అయితే.. కోహ్లీ అందుకు ఇష్టపడలేదని సమాచారం. దీన్ని ఇక్కడైతే వదిలేయడమే మంచిదన్నట్లుగా అతను భావించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘ఇది చాలా దారుణం. అస్సలు సమ్మతించేది కాదు..’ అని కామెంట్ చేశాడు. ఇక భారత జట్టు తదుపై మ్యాచులో బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 2న అడిలైడ్ వేదికగా జరగనుంది.
Virat Kohli didn’t want to file an official complaint about the privacy issue in the Perth hotel. (Source – The Indian Express)
— Johns. (@CricCrazyJohns) October 31, 2022