టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్, రన్ మెషీన్, చేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 220 మిలియన్లు.. ఇండియాలో ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న మరో వ్యక్తి లేడు. అలాంటిది బలూచిస్థాన్‌లో కోహ్లీకి అభిమాని ఉండటంలో ఏంటి గొప్ప అనుకుంటున్నారా? అవును గొప్పే.. ఎందుకంటే.. అది అలాంటి ఇలాంటి ప్రాంతం కాదు.. భౌగోళికంగా పాకిస్థాన్‌లో ఉన్నా.. స్వతంత్ర దేశంగా ఉండాలనే బలమైన ఉద్యమం జరిగిన ప్రాంతం. అక్కడి ప్రజల్లో చాలా మంది తమను పాకిస్థానీలం కాదు.. బలూచిస్థానీలం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఉద్యమ ప్రాంతంలోనూ కోహ్లీకి వీరాభిమానులు ఉండటం నిజంగా విశేషం.
మరీ అక్కడున్న విరాట్ వీరాభిమాని ఆర్‌ఏ గద్దాని కోహ్లీపై తన ప్రేమను భారీగానే చాటుకున్నాడు. ఇసుకపై విరాట్ కోహ్లీ భారీ చిత్రాన్ని గీశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గద్దాని ఆవిష్కరించిన ఈ అద్భుతమైన భారీ చిత్రానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఫాజిలా బలోచ్ అనే ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సైతం గద్దాని రూపొందించిన విరాట్ కోహ్లీ చిత్రాన్ని షేర్ చేశారు. కాగా.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా.. పాకిస్థాన్‌ను ఓడించింది. తర్వాతి మ్యాచ్ మ్యాచ్‌లో పాక్.. జింబాబ్వే చేతిలోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే.
అయితే పాకిస్థాన్‌ను వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఓడించడం.. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తూ.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించడంతోనే బలూచిస్థాన్‌కు చెందిన గద్దాని తన అభిమాన ఆటగాడు కోహ్లీ చిత్రాన్ని ఇసుకపై రూపొందించినట్లు తెలుస్తోంది. పాక్‌పై తమ కోపాన్ని కోహ్లీ రూపంలో తీర్చుకున్నట్లు వారు భావిస్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఎక్కడ రూపొందించింది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. కానీ.. కోహ్లీ చిత్రం మాత్రం అద్భుతంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఉన్న అభిమానుల్లో.. బలూచిస్థాన్ లాంటి ప్రాంతంలో కూడా వీరాభిమానులు ఉండటంపై భారతీయ కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A fan of Virat Kohli @imVkohli, from Balochistan made this amazing portray of #ViratKohli𓃵 using sand art to show his love for the greatest cricketer of our time. pic.twitter.com/GlHvI7ALwA
— Fazila Baloch🌺☀️ (@IFazilaBaloch) October 28, 2022
Amazing sand art by a #ViratKohli fan in Balochistan to show his admiration for the #TeamIndia batting legend.
📸: @IFazilaBaloch pic.twitter.com/cryre0DbSN
— Circle of Cricket (@circleofcricket) October 28, 2022