ఈసారి టీ20 వరల్డ్ కప్ లో అద్భుతాలు జరుగుతున్నాయి! ఎవరూ కనీసం ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. దీంతో స్టేడియం, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు పసికూనలు అనుకున్న జట్లు.. పెద్ద జట్లని ఓడిస్తున్నాయి. ఆయా జట్లలోని ఫీల్డర్లు అయితే కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో కట్టిపడేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న ఐర్లాండ్ జట్టు.. ఇంగ్లాండ్ జట్టుని 5 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ మెక్ కర్తీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో వావ్ అనిపించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. ఆసీస్ బ్యాటింగ్, 14 ఓవర్ ని మార్క్ ఐడార్ వేశాడు. ఈ ఓవర్ రెండో బంతిని స్టోయినిస్ లాంగాన్ వైపు గట్టిగా కొట్టాడు. బంతి గాల్లోకి లేచింది. అటు వైపు పరుగెత్తుకుంటా వచ్చిన మెక్ కర్తీ.. బంతిని క్యాచ్ పట్టాడు. కానీ బౌండరీలో పడిపోతున్నానని తెలిసి బంతిని బయటకు తోసేశాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ డైవ్ చూసి స్వయంగా కామెంటేటర్స్ ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఫీల్డింగ్ అని మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఫీల్డింగ్ లో దుమ్ము రేపిన మెక్ కర్తీ.. బౌలింగ్ లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. టాపార్డర్ లోని ముగ్గురు బ్యాటర్లని ఇతడే ఔట్ చేశాడు. కానీ కెప్టెన్ ఫించ్ 68, స్టోయినిస్ 35 పరుగులు చేయడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఇక అనంతరం ఛేదనలో ఐర్లాండ్ పూర్తిగా తడబడింది. మ్యాచ్ లో ఓడిపోయింది. గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని ఓడించే సరికి ఐర్లాండ్.. ఆసీస్ పై కూడా అద్భుతం చేస్తుందని నెటిజన్స్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
Barry McCarthy! Wow! 😮
One of the best boundary saves you will ever see. #AUSvsIRE #T20IWorldCup pic.twitter.com/yBZzcqDjf0
— Sportstar (@sportstarweb) October 31, 2022