ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. 8 పాయింట్లతో గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత్.. ఈ నెల 10 అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో దుమ్మురేపింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్.. అదే ఫామ్‌ను కొనసాగించి మరో హాఫ్ సెంచరీ బాదేశాడు. కోహ్లీ.. 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక మోస్తారు స్కోర్ దిశగా సాగుతున్న టీమిండియాను సూర్య భాయ్ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.
చివరి ఐదు ఓవర్లలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. తనకు మాత్రమే సాధ్యమైన అసాధారణమైన షాట్లతో జింబాబ్వే బౌలింగ్‌ను కకావికలం చేశాడు. సూర్య సునామీ ముందు జింబాబ్వే బౌలర్లు నిలువలేకపోయారు. 150, 160 స్కోర్ చేసుందనుకున్న టీమిండియా.. సూర్య 360 డిగ్రీ బ్యాటింగ్‌తో ఏకంగా 186కు చేరుకుంది. చివరి ఐదు ఓవర్లలో 70పై చిలుకు పరుగులు రావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న సూర్య.. జింబాబ్వేపై మూడో హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే సూర్య ఆడిన ఇన్నింగ్స్‌పై ఒక రేంజ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని షాట్లకు ఆశ్యర్యపోని క్రికెట్ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని రితీలో సూర్య షాట్లు ఆడాడు. సూర్య ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి.. అసలైన మిస్టర్ 360 సూర్యనే అంటూ పేర్కొంటున్నారు. అయితే.. తన ఇన్నింగ్స్, వస్తున్న ప్రశంసలపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. మిస్టర్ 360 ప్లేయర్ ఒక్కరే ఉన్నారని.. నేను కేవలం ఏబీ డివిలియర్స్‌లా ఆడాలని ప్రయత్నిస్తున్నానని అన్నాడు. అలాగే సూర్య ఇన్నింగ్స్, అతని కామెంట్‌పై ఏబీ డివిలియర్స్ కూడా స్పందిస్తూ.. ‘నువ్వు నన్ను చాలా త్వరగా అందుకుంటున్నావ్ డ్యూడ్, నాకంటే ఇంకా చాలా బెటర్‌గా కూడా.. ఈ రోజు అద్భుతంగా ఆడావ్’ అంటూ ప్రశంసించాడు.
This is Only One MR. 360° @ABdeVilliers17 ❤️👏🙌 https://t.co/0esGHZojH2
— Akshi (@Aakansh92020793) November 6, 2022