టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఈ ఆదివారం దాయాది పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మరో మెగా పోరుకు సై అంటే సై అంటున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ 2021లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్.. అదే టెంపోను కొనసాగించాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉన్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ 2022లో ఇరు దేశాలు తపడినా.. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వచ్చేసరికీ కథ వేరే ఉంటుంది. ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌లో భారత్, మరో మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి లెక్క సరిచేసుకున్నాయి. కానీ.. వరల్డ్ కప్ వేదికలపై పాక్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించే టీమిండియా.. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆ రికార్డు గండికొట్టుంది. 10 వికెట్లతో తేడాతో దారుణ ఓటమిని చవిచూస్తుంది. ఆ వరల్డ్ కప్‌లో గ్రూప్‌స్టేజ్ నుంచే ఇంటికొచ్చింది. ఈ ఘోర అవమానానికి ప్రతీకరం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటే భావోద్వేగాలతో కూడిన ఆట. ఈ మ్యాచ్‌పై ఉండే అంచనాలు, ఆసక్తి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అనగానే ఆసక్తి చూపిస్తుంటారు. కాగా.. ఈ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. మ్యాచ్‌కు ముందే అదే స్థాయిలో మాట యుద్ధం కూడా జరుగుతుంటుంది. మ్యాచ్‌కు ముందు ఇరుదేశాల ఆటగాళ్లు తమ బలాబలాల గురించి, అవతలి టీమ్ బలహీనతల గురించి ప్రస్తావించడం, దానికి ప్రత్యర్థి జట్టు కౌంటర్లు ఇవ్వడంతో మ్యాచ్‌కు ముందే మాట యుద్ధం పరిపాటి. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 23న జరగబోయే మ్యాచ్‌కు ముందు కూడా మాటల యుద్ధం మొదలైపోయింది. ఆటగాళ్ల కంటే ఘాటుగా, ధీటుగా ఇరుదేశాల క్రికెట్ అభిమానులు మాటల యుద్ధం ఆరంభించారు.
తాజాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఒక క్రికెట్ అభిమాని టీమిండియా సెటైర్ వేశాడు. అఫ్ఘానిస్థాన్ బ్యాటర్ గుర్బాజ్‌కు చూపించింది. జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ఇండియాకు కనిపిస్తుందని అన్నాడు. ‘152 ప్రాబ్లమ్స్ ఆఫ్ టీమ్ 36’ కామెంట్ చేశాడు. గంటకు 152 కిలో మీటర్ల వేగంతో వేసే బంతులు టీమ్ 36ను ఇబ్బంది పెడతాయని అతని ఉద్దేశం. 36 అంటే.. ఆ మధ్య టీమిండియా ఆస్ట్రేలియాపై 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. హేళన చేశాడు. అలాగే.. పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో పాక్ స్టార్‌పేసర్ షాహీన్ షా అఫ్రిదీ వేసిన డెడ్లీ యార్కర్‌కు అఫ్ఘాన్ బ్యాటర్ గుర్బాజ్ గాయపడ్డాడు. అతన్ని భుజాలపై మోసుకుంటూ గ్రౌండ్ బయటికి తీసుకెళ్లారు. ఈ సంఘటన ప్రస్తావిస్తూ.. గుర్బాజ్‌కు చూపించి ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇండియాపై ఉంటుందని ఎటకారం ఆడాడు. కానీ.. ఈ వ్యక్తికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. కాగా.. ఈ ఆదివారం జరిగే పోరులో ఎవరి నోర్లు మూసుకుంటాయో.. ఎవరి కాలర్లు ఎగురుతాయో చూడాలి.
Shaheen’s ball to Gurbaz was just a trailer, the movie ‘152 problems of Team36’ will be released on 23rd October for Diwali. #Cricket #PAKvIND
— Daniel Alexander (@daniel86cricket) October 19, 2022